Begin typing your search above and press return to search.
కరోనా వెళ్లిపోయిందనుకున్నారా.. డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
By: Tupaki Desk | 5 Jun 2020 5:00 AM GMTఆరోగ్యం విషయంలో ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, హెచ్చరికలు జారీ చేస్తుంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ సంస్థ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, వైరస్ ప్రభావం ఎక్కడెలా ఉందో అప్ డేట్ చేస్తూ ప్రపంచ దేశాల్ని ముందుకు నడిపిస్తోంది. కరోనా ఒక మహమ్మారి అని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించాకే ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఐతే గత నెల వరకు కరోనా విషయంలో భయపడుతూ, అప్రమత్తంగా ఉన్న ప్రపంచ దేశాలు.. ఇప్పుడు లాక్ డౌన్‌ను ఎంతో కాలం భరించే శక్తి లేక కాడి వదిలేస్తున్నాయి. సడలింపులు ఇచ్చేస్తున్నాయి. ఇండియా సహా అన్ని దేశాలూ అన్ని రంగాలకూ మినహాయింపులు ఇచ్చేస్తున్నాయి. ఈ పరిణామం పట్ల డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
అనేక దేశాల్లో కరోనా లాక్ డౌన్ సడలింపులు ఇస్తుండడంపై డబ్ల్యూహెచ్‌వో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని.. సడలింపులు ఇచ్చినా, ప్రజలు తమ జాగ్రత్తలు తాము చూసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఐరోపా దేశాల్లోనే కాకుండా ఇతర ఖండాల్లోనూ అనేక దేశాల్లో భౌతిక దూరం సహా అనేక అంశాల్లో సడలింపులు ఇస్తుండడంతో ఈ వైరస్ ప్రభావం పోయిందన్న భావన ప్రజల్లో కలుగుతోందని.. కానీ అది కరెక్ట్ కాదని.. ఈ వైరస్ ఎక్కడికీ పోలేదని, ప్రపంచంలో ఎక్కడా ఈ వైరస్ లేదు అనేంతవరకు దీన్ని ఓ ముప్పుగానే పరిగణించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కరోనా ప్రభావం నుంచి పూర్తిగా ఎప్పుడు బయటపడతామో చెప్పలేమని కూడా అంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 67 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. 4 లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.