Begin typing your search above and press return to search.
తేల్చిచెప్పిన డబ్ల్యూహెచ్ఓ: కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో రాదు
By: Tupaki Desk | 6 May 2020 1:00 PM GMTకరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులైతే వ్యాక్సిన్ వస్తే ఆ మహమ్మారికి విరుగుడు వచ్చినట్టేనని భావిస్తున్న ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్‌కు ఇచ్చింది. త్వరలోనే అందుబాబులోకి మందు వస్తుందని ఆశించడం తప్పు అని, ఇప్పట్లో కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని తేల్చి చెప్పారు. కరోనాకు వైరస్ కనుగొనడం ఇప్పటికిప్పుడు వస్తుందని తాము భావించడం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్త డేవిడ్ నబారో తెలిపారు. వ్యాక్సిన్ తయారీ అంటే మాటలు కాదని, దానికి ఎన్నో దశలు ఉంటాయని వివరించారు. చాలా దశలు పూర్తి చేయాల్సి ఉంటుందని, మొదటి దశలో వ్యాక్సిన్‌ను మనిషికి ఇస్తే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
మనిషిపై ప్రయోగించి ఆ వ్యాక్సిన్ వైరస్‌ని చంపుతుందా లేదా అనేది గుర్తించారు. దాని అనంతరం మూడో దశలో వ్యాక్సిన్‌తో మనిషికి దీర్ఘకాలిక సమస్యలేమైనా వస్తాయా అని, నాలుగో దశలో వ్యాక్సిన్ ఇస్తే, ఆ వ్యక్తికి ఆల్రెడీ ఉన్న జబ్బులపై ఎలాంటి ప్రభావం వంటివి పరిశీలిస్తారని వెల్లడించారు. ఇక అవన్నీ విజయవంతమైతే చివరి దశలో ఈ వ్యాక్సిన్ ఏ వయసు వారిపై ఎలా పనిచేస్తోందనేది పరిశీలించి చివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తారని వివరించారు. ఇన్ని దశల్లో ఎక్కడా విఫలమైనా మళ్లీ తొలి నుంచి పరిశోధనలు చేసి అన్ని దశల్లో అప్రూవ్ అయితేనే మందు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇప్పటికీ డెంగ్యూ, హెచ్‌ఐవీ ఎయిడ్స్ వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనలేదని.. ఇప్పుడు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కూడా అదే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఎయిడ్స్‌తో ప్రతి సంవత్సరం ప్రపంచంలో 3.2 కోట్ల మంది మరణిస్తున్నారని.. ఇప్పుడు కరోనాది అదే పరిస్థితి అని వివరించారు. అందుకే ఇప్పట్లో కరోనా వైరస్‌కు మందు రాదని.. జాగ్రత్తలు పాటించి సమాజం నుంచి ఆ వైరస్‌ను వెళ్లగొట్టడమే తక్ష కర్తవ్యమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్త డేవిడ్ నబారో మాటల వెనుక ఉన్న అర్థం.