Begin typing your search above and press return to search.
తైవాన్- చైనా మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసిన డబ్ల్యూహెచ్ఓ
By: Tupaki Desk | 11 April 2020 5:30 AM GMTప్రపంచంలో ఆరోగ్య పరిస్థితులు, వైద్య సేవలు తదితర అంశాలపై అంతర్జాతీయంగా పని చేసే సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ). ప్రస్తుతం కరోనా వైరస్ దరిమిలా విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ రంగంలోకి దిగింది. కరోనా వైరస్‌పై ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలకు సలహాలు, సూచనలు ఇస్తూనే ఆ వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను చెబుతోంది. ఈ సందర్భంగా రోజువారీగా ప్రపంచంలో కరోనా కేసులు, మృతుల ఎంతమందో ఓ నివేదిక విడుదల చేస్తోంది. అయితే డబ్ల్యూహెచ్ఓ విడుదల చేస్తున్న నివేదికపై స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తైవాన్ మండిపడుతోంది. ఎందుకంటే తమను ఒక దేశంగా గుర్తించకుండా, తమ దేశంలో కరోనా పరిస్థితిపై చైనాతో కలిపి లెక్కించడాన్ని తప్పుబట్టింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓపై తైవాన్ మండిపడింది. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌ఓ అధ్యక్షుడు టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ స్పందింది.. తమ సంస్థను జాత్యహంకారిగా చిత్రీకరిస్తూ ప్రచారమవుతోందని, తమపై అసత్యాలు తైవాన్ లో పురుడు పోసుకుంటున్నాయని.. వ్యాఖ్యానించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పై తైవాన్ ఉద్దేశ పూర్వకంగానే విషం చిమ్ముతోందని చైనా మండిపడింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో స్వాతంత్ర్యం పొందేందుకు జాతి విద్వేష చర్యలను రెచ్చగొడుతోందని పేర్కొంది.
ఈ విధంగా తైవాన్, చైనా మధ్య డబ్ల్యూహెచ్ఓ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. వాస్తవంగా తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే చైనా మాత్రం ఆ భూభాగం తమ ఆధీనంలోనే ఉందని వాదిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల డబ్ల్యూహెచ్‌ఓ సభ్యత్వ దేశాల నుంచి తైవాన్‌ను తొలగించింది. ఈ నిర్ణయాన్ని తైవాన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక చైనానే కారణమని, చైనా ఒత్తడితోనే అంతర్జాతీయ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని తైవాన్ ఆరోపించింది. చైనా మాటలకు తలొగ్గి డబ్ల్యూహెచ్‌ఓ తమను వెలివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ తమను ఒక దేశంగా గుర్తించకుండా కరోనా కేసులను చైనాతో కలిపి లెక్కించి వెల్లడించడాన్ని తైవాన్ మండిపడింది. డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు మద్దతుగా నిలుస్తోందని ఆరోపించింది. వైరస్‌కు సరిహద్దులు ఉండవని, ఎక్కడైనా విస్తరిస్తుండడంతో అందరినీ అప్రమత్తం చేయాలని తైవాన్ డబ్ల్యూహెచ్ఓకు హితవు పలికింది.
అయితే ఈ విమర్శలపై చైనా స్పందించింది. నీతి నియమాలు లేని తైవాన్ వాసులు స్వాతంత్ర్యం కోసం వైరస్ ను వాడుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌ఓపై విషం కక్కుతున్నారని, కుట్రపూరితంగానే జాతి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొంది. అయితే అలాంటి వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ ఆరోపణలను ఖండించిన తైవాన్ చైనాపై ప్రతిదాడికి దిగింది. డబ్ల్యూహెచ్‌ఓపై చెడుగా ప్రచారం చేస్తోంది చైనానేనని స్పష్టం చేసింది. తాము చేయని తప్పునకు టెడ్రోస్‌ను క్షమాపణలు అడిగితే అంతర్జాతీయ సమాజంలో తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని చైనానే తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని... సరిహద్దుల వెంట కవ్వింపు చర్యలకు పాల్పడేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే మొదటి నుంచి డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు టెడ్రోస్ ఎన్నికైనప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆయన చైనాకు మద్దతు పలుకుతున్నాడని, ఆ దేశానికి మద్దతుగా నిలుస్తూ రుణం తీర్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. తైవాన్‌లో సా యింగ్-వెన్ నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమను తాము ఒక దేశంగా పేర్కొంటూ ప్రస్తుతం తైవాన్‌వాసులు భావిస్తున్నారు. అయితే ఇంకా ఎవరూ తైవాన్‌ను ఒక దేశంగా గుర్తించలేదు. కాకపోతే దశాబ్దాల నుంచి తైవాన్ ఒక దేశంగా ఆవిర్భవించాలనే ఆశతో ఉంది.