Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ పంపిణీ అసమానతలపై డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి !

By:  Tupaki Desk   |   19 Jan 2021 2:30 PM GMT
వ్యాక్సిన్ పంపిణీ అసమానతలపై డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి !
X
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో జరుగుతున్న అసమానతలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది.వ్యాక్సిన్ మాకే ముందు దక్కాలి అని ధనిక దేశాలు అనుకోవటం సరైంది కాదని..ధనిక దేశాలకు 39 మిలియన్ల డోసులు అందితే అదే ఓ పేద దేశానికి 25 డోసులే అందటం సరైంది కాదని వ్యాఖ్యానించింది. వ్యాక్సిన్ ను దక్కించుకున్న దేశాలు వారి దేశంలోని యువతకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ పేద దేశాల్లో మాత్రం బాధితులకు కూడా వ్యాక్సిన్ వేయించుకోలేని పరిస్థితి ఉందని డబ్యుహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రీసియస్ ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్ మాకే దక్కాలనే ధనిక దేశాల ఆలోచన మంచిది కాదనీ, ఇది సరైంది కాదనీ అన్నారు. ప్రాణాలు అందరికీ ఒక్కటేననే విషయం ధనిక దేశాల ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు వ్యాక్సిన్లు రంగప్రవేశం చేశాయి. అయితే కరోనా టీకాల పంపిణీలో అసమానతలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రీసియస్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన క్రమంలో ధనిక దేశాల తీరు చూస్తే ప్రపంచం దారుణమైన రీతిలో నైతిక వైఫల్యం అంచున నిలిచినట్టుగా అనిపిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను కూడా విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా టీకాకు ఆమోదం కోసం డబ్ల్యూహెచ్ ఓ కు డేటా సమర్పించేందుకు బదులు, ధనిక దేశాల్లో రెగ్యులేటరీ వ్యవస్థల వెంబడి అత్యవసర వినియోగం అనుమతుల కోసం వెంపర్లాడుతున్నాయని ఆరోపణలు చేశారు. ప్రపంచంలో అందరికీ సమాన ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ అందించాలన్న హామీ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడిందని టెడ్రోస్ అధనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు.