Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు శ‌ప‌థం నెర‌వేర్చేవారు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   13 Dec 2021 2:30 AM GMT
చంద్ర‌బాబు శ‌ప‌థం నెర‌వేర్చేవారు ఎవ‌రు?
X
అవును..! టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన శ‌ప‌థాన్ని నెర‌వేర్చేవారు ఎవ‌రు? ఆయ‌న‌కు చేదోడుగా నిలిచి.. ముందుకు తీసుకువెళ్లేవారు ఎవ‌రు? ఇదీ ఇప్పుడు.. టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. గ‌త నెల‌లో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన స‌మ‌యంలో చంద్ర‌బాబును, ఆయ‌న కుటుంబాన్ని అవ‌మానించార‌ని పేర్కొంటూ.. అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయ్యాకే.. తాను అసెంబ్లీలోకి అడుగు పెడ‌తానంటూ.. చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. దీనిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని కూడా నిర్ణ‌యించా రు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అసెంబ్లీలో అవ‌మానం జ‌రిగింది.. చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు.

అయితే.. అస‌లు చంద్ర‌బాబు చేసిన శ‌ప‌థాన్ని ఎంత‌మంది సీరియ‌స్ గా తీసుకున్నారు? పార్టీలో ఎంత మంది ఈవిష‌యాన్ని సిన్సియ‌ర్‌గా భావిస్తున్నారు? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన దాదాపు పాతిక రోజులు అవుతోంది. ఈ మ‌ధ్య కాలంలో దాదాపు అంద‌రూ మ‌రిచిపోయారు. ఒక్క చంద్ర‌బాబు మాత్ర మే.. దీనిని ప్ర‌చారం చేసుకుంటున్నారు. నేను శ‌ప‌థం ప‌ట్టాను. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. ముఖ్య‌మంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడ‌తాను. ఈ విష‌యం మీకు గుర్తుందా ? అంటూ.. నేత‌ల‌కు ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు చంద్ర‌బాబు శ‌ప‌థం నెర‌వేరుతుందా? అనే చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో వ‌చ్చే ఎన్నిక‌లు.. టీడీపీకి అత్యంత కీల‌కం. ఎందుకంటే.. టీడీపీ హిస్ట‌రీలో ఎన్న‌డూ.. ఈ త‌ర‌హా శ‌ప‌థం చేసిన ప‌రిస్థితి లేదు. పైగా .. చంద్ర‌బాబు వంటి విజ‌న్ ఉన్న నాయకుడు.. చేసిన శ‌ప‌థానికి చాలా వాల్యూ ఉంది. అయితే.. దీనిని చాలా మంది నేత‌లు.. దీనిని లైట్‌గా తీసుకుంటు న్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో స్వ‌యంగా చంద్ర‌బాబు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల వ‌రుస పెట్టి నెల్లూరు, అనంత‌పురం జిల్లాలకు చెందిన నేత‌ల‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. పార్టీ ప‌రిస్థితిపై.. స‌మీక్షించిన స‌మ‌యంలో నేత‌ల్లో ప‌ట్టుద‌ల క‌నిపించ‌క పోవ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

చంద్ర‌బాబు చేసిన శ‌ప‌థాన్ని వాస్త‌వానికి పార్టీలో ప్ర‌తి ఒక్క‌రూ సీరియ‌స్‌గా తీసుకుని ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ.. అలా కాకుండా.. నాయ‌కులు లైట్ తీసుకుంటున్నార‌నే కామెంట్లు చంద్ర‌బాబు వ‌ర‌కు వెళ్లాయి. దీంతో బాబు సీరియ‌స్‌గానే ఉన్నారు. త‌న శ‌ప‌థాన్ని సీరియ‌స్‌గా తీసుకోనివారికి క్లాస్ ఇస్తున్నారు. అంతేకాదు.. సీరియ‌స్‌గా లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న నాయ‌కుల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తుండ‌డం కూడా గ‌మ‌నార్హం. మ‌రి మిత్తానికి ఈ ప‌రిణామ‌.. పార్టీకి ఏమేర‌కు మేలు చేస్తుందో చూడాలి.