Begin typing your search above and press return to search.

రెండో దశలో కరోనా వ్యాక్సిన్ ఎవరికంటే?

By:  Tupaki Desk   |   22 Jan 2021 11:30 PM GMT
రెండో దశలో కరోనా వ్యాక్సిన్ ఎవరికంటే?
X
దేశవ్యాప్తంగా పకడ్బందీగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ముందుగా వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఈ టీకాను వేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో దాదాపు 10 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వివిధ స్థాయిల్లో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఇక రెండో దశలో జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ టీకా వేయించుకోనున్నారు. ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు.

ప్రధాని సహా ముఖ్య నేతలకు రెండోదశలో టీకా వేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.అలాగే 50 ఏళ్ల వయసు పైబడిన వారికి కోవిడ్ టీకా అందజేస్తామని తెలిపింది రెండో దశలో తొలిరోజు ప్రధాని, సీఎంలకు టీకాలు ఇవ్వనున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ప్రధాని మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో టీకా వేయించుకున్న లబ్ధిదారులతో తాజాగా మాట్లాడారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన ప్రజలు, వారి అనుభవాలను మోడీతో పంచుకున్నారు. రాజకీయ నాయకులు టీకా కోసం క్యూలు కట్టకూడదని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోడీ స్వదేశీ కోవాక్సిన్ తీసుకుంటారా? విదేశాల్లో తయారై భారత్ లో ఉత్పత్తి అయిన కోవీషీల్డ్ తీసుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది.