Begin typing your search above and press return to search.
కల్కి ఖేల్ ఖతం.. తర్వాత స్వాములు వీరేనా?
By: Tupaki Desk | 19 Oct 2019 4:39 AM GMTకలియుగ ప్రత్యక్ష దైవాలమని.. విష్ణువు అవతార పురుషులమని నమ్మించి భక్తి ముసుగులో వేలకోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వచ్చిన కల్కి భగవాన్ ఆగడాలు ఐటీ అధికారుల దాడులతో బయటపడుతున్నాయి. ఆయన ఆశ్రమాల పై దాడులు చేసిన అధికారులు ఏకంగా 500 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. కిలోల కొద్ది బంగారం - వజ్రాలు - నగలు - అమెరికన్ డాలర్లను పట్టుకున్నట్టు తెలిపారు. ఇక దేశం దాటించి విదేశాల్లో భారీగా కూడబెట్టిన అక్రమ ఆస్తుల లెక్కను తేల్ారు.
అయితే కల్కి భగవాన్ కు దేశంలో చాలా పేరుంది. పరపతి ఉంది.ఆయన ప్రభుత్వాన్ని శాసించే కేపాసిటీ గల నేత.. ఇలాంటి బిగ్ షాట్ ను కూడా వదలకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఐటీ దాడులు చేయించడం దేశంలోని మిగతా స్వాముల్లో గుబులు రేపుతోందట.. హిందుత్వానికి ఫేవర్ గా ఉండే బీజేపీ ఇలాంటి దాడులకు పురిగొల్పడమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు కల్కి భగవాన్ ఖేల్ ఖతం చేసిన ఐటీ అధికారులు నెక్ట్స్ ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ సాగుతోంది.
ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిన స్వాములు - మఠాలు - ఆశ్రమాలు ఎక్కువైపోయాయి. రోజుకో స్వామి పుట్టుకొచ్చి దేవుడిగా ప్రకటించుకుంటూ వేలకోట్ల అధిపతులు అయిపోతున్నారు. ఆధ్యాత్మిక సేవ అంటూ నిస్వార్థంగా చేస్తామంటూ దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెలుగు నాట అయితే సీఎంలను కూడా రప్పించుకొని వారిని రాజకీయాధికారం లోకి తీసుకొచ్చామంటూ నెత్తిన కూర్చుంటున్న స్వాముల సంగతి తెలిసిందే..
కల్కి భగవాన్ ఖేల్ ఖతం చేసిన ఐటీ అధికారులు నెక్ట్స్ ఏ స్వామిని టార్గెట్ చేశారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని మరో ప్రముఖ స్వామి ఆశ్రమాల పై కూడా దాడులకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే , ఓ ముఖ్యనేతకు సన్నిహితంగా ఉండే స్వామీజీని కూడా బీజేపీ సర్కారు టార్గెట్ చేసిందన్న ప్రచారం సాగుతోంది.
ఇలా బీజేపీకి దూరంగా ఉంటున్న స్వామీజీల పై ఐటీదాడులకు బీజేపీ సర్కారు రెడీ అయ్యిందన్న ప్రచారం సాగుతోంది. ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారం చేస్తూ వేలకోట్లు కొల్లగొడుతున్న వీర ఆగడాలకు ఇక చెక్ పడనుంది.