Begin typing your search above and press return to search.
ఉద్యోగుల సమ్మెతో ఎవరికి నష్టం ?
By: Tupaki Desk | 25 Jan 2022 5:08 AM GMTనిరవధిక సమ్మె చేయబోతున్న ఉద్యోగులకు తీరని నష్టం జరిగే ప్రమాదం కనబడుతోంది. పీఆర్సీ వివాదంలో ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మెకు వెళ్ళబోతున్నట్లు సమ్మె నోటీసిచ్చారు. అంతా బాగానే ఉందికానీ విచారణలో భాగంగా కోర్టులో జడ్జి చేసిన కీలక వ్యాఖ్యలపై ఉద్యోగుల మధ్యే పెద్దఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా పిటీషన్ వేయగానే కోర్టు అలా తమకు అనుకూలంగా తీర్పిచ్చేస్తుందని బహుశా ఉద్యోగనేతలు అనుకున్నట్లున్నారు.
ఆ ఉద్దేశ్యంతోనే కోర్టులో కేసు వేసిన నేతలకు పెద్ద షాక్ తగిలింది. పీఆర్సీ అంటే పే రివిజన్ కమీషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ రివిజన్ అంటే జీతాలు పెరగచ్చు లేదా తగ్గచ్చు కూడా. మామూలుగా అయితే ఏ ఉద్యోగయినా తమ జీతం పెరగాలనే కోరుకుంటారనటంలో సందేహంలేదు. ఆర్ధిక పరిస్ధితిని బట్టి లక్షలాదిమంది ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కూడా జీతాలను పెంచుతున్నాయి.
ఇపుడు కూడా ఓవరాల్ గా జీతాలు పెరిగాయి. కాకపోతే ఉద్యోగులు ఆశించినంతగా పెరగలేదంతే. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు ఆశించినంతగా జీతాలు పెంచలేమని చెప్పింది ప్రభుత్వం. దీన్నే వ్యతిరేకిస్తు ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నారు. ఇదే విషయంపై కోర్టు తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా చెప్పింది. పీఆర్సీ పై ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని తేల్చి చెప్పింది.
ఉద్యోగుల వాదనలకు వ్యతిరేకంగా కోర్టు అనేక వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో మామూలు ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. విచారణ తర్వాత తీర్పు కూడా తమకు వ్యతిరేకంగా వస్తే అప్పుడేమి చేయాలనే విషయమై పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. కోర్టు తీర్పును ధిక్కరించి సమ్మెలోకి వెళ్ళే పరిస్ధితి లేదనేది ఎక్కువమంది ఉద్యోగుల భావన. పైగా జీతాల విషయంలో ఇప్పటికే సమాజంలోని అన్ని వర్గాల నుంచి ఉద్యోగులపై వ్యతిరేకత కనబడుతోంది.
అయినా సరే మొండిగా సమ్మె విషయంలో ముందుకే వెళితే మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యం లేదనే ఆందోళన ప్రస్తుతం ఉద్యోగ సంఘ నాయకుల్లో మొదలైంది. సమ్మె విషయంలో పట్టుబట్టేకన్నా మంత్రుల కమిటితో చర్చలకు వెళ్ళి ఏదో పద్దతిలో వివాదాన్ని పరిష్కారం చేసుకోవటమే మేలని ఉద్యోగ సంఘాల నాయకులు అనుకుంటున్నారు. కానీ ఉద్యోగుల్లో మెజారిటీ మాత్రం సమ్మెకే మొగ్గు చూపుతున్నారు. దీంతో విధిలేక వారు కూడా సమ్మెకే మొగ్గు చూపారు. మరి ఉద్యోగ నేతలు ఏమి చేస్తారో చూడాలి.