Begin typing your search above and press return to search.
ఈ రంగుల వెనుక ఎవరున్నారు? వైసీపీ అధిష్టానంలో చర్చ!
By: Tupaki Desk | 22 Nov 2019 12:08 PM GMTఉన్నట్టుండి ఎవరో శ్మశానంలో సమాధులకు వైసీపీ రంగులు వేసి ఒక ఫొటోను అప్ లోడ్ చేశారు! కొన్ని నిమిషాల్లోనే అది వైరల్ అయ్యింది. ఆ తర్వాత జాతిపిత గాంధీ విగ్రహం ఉన్న దిమ్మకు వైసీపీ రంగులు వేసి ఆ ఫొటోనూ వైరల్ గా మార్చారు. ఆ ఫొటోలను తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తమ తమ అధికారిక ట్విటర్ ఖాతాల్లోకి అప్ లోడ్ చేస్తూ ఉన్నారు!
ఇదంతా ఒక గేమ్ ప్లాన్ ప్రకారం జరుగుతోందా? అనే సందేహం వ్యక్తం అవుతూ ఉందిప్పుడు! ఏ రాజకీయ పార్టీ అభిమాని అయినా.. మరీ శ్మశ్మానంలోకి వెళ్లి తన పార్టీ రంగులను వేసుకోవాలని అనుకోడు. అంత మూర్ఖత్వం ఎవరికీ ఉండదు. కానీ అలాంటి ఫొటో ఒకదాన్ని వైరల్ చేశారు.
అదంతా వ్యూహాత్మకం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై బురదజల్లే క్రమంలోనే అలాంటి పని చేశారని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కుట్ర ఉండవచ్చని వైసీపీ వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి.
అందులోనూ ఇది ఫొటో షాప్ జనరేషన్. దేన్నైనా ఇట్టే సష్టించవచ్చు. కాబట్టి అధికారంలో ఉన్న వారిపై బురదజల్లేందుకు కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.
అలాగే ఆ ఫొటోలు వెంటనే వైరల్ కావడం కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న పనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఆ ఫొటోలను వైసీపీ వ్యతిరేక ప్రముఖుల అకౌంట్ల ద్వారా షేర్ చేసి.. ప్రీ ప్లాన్డ్ వ్యూహాలను అమలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏదేమైనా ఈ అంశాలపై దృష్టి సారించాలని, ఇందులో కుట్ర కోణాలను బయటకు తీయాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్టుగా సమాచారం.