Begin typing your search above and press return to search.

జగన్ పై హత్యయత్నం.. వెనుక వీరి హస్తం.?

By:  Tupaki Desk   |   25 Oct 2018 10:28 AM GMT
జగన్ పై హత్యయత్నం.. వెనుక వీరి హస్తం.?
X
వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగింది. ఏపీలో అధికార ఆటలో అడ్డుగా నిలబడ్డ వైఎస్ జగన్ ను అడ్డు తొలగించుకోవాలనే కుట్ర భాగంగా ఇది జరిగిందా.? జగన్ పై హత్యాయత్నం పెద్ద కుట్రనా.? ఎంతో సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్టులో ఇంత పకడ్బందీగా కోడిపందేల్లో కోళ్లకు కట్టే చిన్న కత్తితో ఓ యువకుడు చంపించేందుకు ప్రయత్నించడం వెనుక పెద్ద తలకాయలున్నాయా.? అశేష అభిమాన జనంతో వచ్చే ఎన్నికల్లో విజయానికి చేరువవుతున్న జగన్ ను చంపి అడ్డు తొలగించుకోవాలనుకున్నారా.? అంటే ఔననే సమాధానం వస్తోంది.

* వైఎస్ జగన్ హత్యాయత్నం ఎలా జరిగింది.?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం కలకలం రేగింది. ఏపీలో ఉధృతంగా ప్రచారం చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్న జగన్ .. శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం వచ్చారు. ఎయిర్ పోర్టులోని హోటల్ లో పనిచేసే వెయిటర్ శ్రీనివాసరావు జగన్ తో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చాడు. 160 సీట్లు గెలుస్తారా అంటూ జేబులోని కత్తి తీసి గొంతులో పొడవడానికి ప్రయత్నించాడు. కానీ దాన్నుంచి జగన్ తప్పించుకోవడంతో ఆ కత్తి వేటు భుజానికి తాకింది. ఒకవేళ జగన్ అప్రమత్తంగా లేకుంటే అది ఆయన గొంతులో దిగే ప్రాణాలకే ప్రమాదంగా పరిగణించిందే.. దాడి జరగ్గానే పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నిందుతుడు శ్రీనివాస్ రావును అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

*జగన్ పై దాడిచేసిన శ్రీనివాస్ రావు ఎవరు.?

వైఎస్ జగన్ పై కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి పేరు శ్రీనివాసరావు. అమలాపురం వాసి. జగన్ వద్దకు సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి దుండగుడు తన జేబులో దాచుకున్న కోడిపందాలకు వాడే కత్తితో చంపాలని చూశాడు. ఇతడు ఎయిర్ పోర్టులోని ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. విమానం కోసం వీఐపీ లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ కు టీ ఇచ్చి సెల్ఫీ తీసుకునే యత్నంలో దాడికి పాల్పడ్డాడు.

*ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ టీడీపీ నేతలదేనా.?

విశాఖ ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ లో నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఈ రెస్టారెంట్ టీడీపీ నేతలదేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొంత మంది టీడీపీ నేతలే ఇతడిని రెచ్చగొట్టి ఈ హత్యయత్నానికి ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*ఏపీ డీజీపీ, ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.

జాతీయ స్థాయి భద్రతా సిబ్బంది సీఐఎస్ఎఫ్ నిరంతరం నిఘా కాసే విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడిని ఏపీ డీజీపీ ఠాకూర్ చాలా లైట్ గా తీసుకున్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై హత్య కు సీఐఎస్ఎఫ్ దే బాధ్యత అని తప్పించుకున్నారు. అసలు జగన్ భద్రత పరిధి సీఐఎస్ ఎఫ్ పరిధిలోకి వస్తుందని.. అక్కడ ఏపీ పోలీసులు ఉండరని తేల్చిచెప్పారు. ఆ నెపం సీఐఎస్ఎఫ్ పై వదిలేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఏపీకి ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే అది తమ పరిధికాదని ఏపీ ప్రభుత్వం, డీజీపీ వెనకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*అందుకే హత్యయత్నమా.?

ఏపీలో వైఎస్ జగన్ పాదయాత్రతో దూసుకుపోతున్నారు. ఏపీలో గాలి ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా మారుతోంది. అధికార పార్టీ అవినీతి, అస్తవ్యస్త పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చేసారి అధికారంలోకి జగన్ వస్తున్నాడన్న సూచలను కనిపిస్తున్నాయి. దీంతో జగన్ ను ఆపడం సాధ్యం కాదని భావించి కొందరు అడ్డు తొలగించుకునే కుట్రలోనే చంపించేందుకు ప్లాన్ చేశారా అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ పై హత్యయత్నానికి పాల్పడింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనివెనుకు పెద్ద కుట్రకోణం ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించడం కలకలం రేపుతోంది. ఇది ఒక కక్ష్య పూరితంగా చేసింది కాదని.. ఒక ప్లాన్ ప్రకారం చేసిందని.. ఎవరో వెనుకుండి చేయించారని ఆమె ఆరోపించారు. ఎయిర్ పోర్టు లో స్థానిక పోలీసులు ఉండరు కాబట్టి ఇక్కడ హత్యకు ప్లాన్ చేశారని ఆమె ఆరోపించారు.