Begin typing your search above and press return to search.
రామచంద్రయ్య చేరిక వెనుక...!?
By: Tupaki Desk | 14 Nov 2018 4:32 AM GMTరాజకీయాల్లో సీనియర్ నాయకుడు - మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారనేదే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రామచంద్రయ్య మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ఆప్తుడు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన రామచంద్రయ్య ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు కాగానే అందులో చేరారు. ప్రజారాజ్యం అధినేత - మెగాస్టార్ చిరంజీవి కూడా తన పార్టీలో రామచంద్రయ్యకు చాలా గుర్తింపు ఇచ్చారు. ఒక దశలో రామచంద్రయ్యే ప్రజారాజ్యం పార్టీలో నెంబర్ టూ గా ఎదిగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓటమి పాలైనా రామచంద్రయ్య మాత్రం చిరంజీవిని వదల్లేదు. ప్రజారాజ్యంలో ఉండగా చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ తో అనేక సార్లు రామచంద్రయ్యకు వివాదాలు వచ్చాయి. ఆ సమయంలో చిరంజీవి కూడా రామచంద్రయ్యకే మద్దతు నిలిచారని అంటారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. దీనిని పార్టీలో కొందరు వ్యతిరేకించారు. రామచంద్రయ్య కూడా ఈ విలీనంపై కాసింత అలకపూనారు. కాంగ్రెస్ వ్యతిరేకిగా కడప జిల్లాలో పేరు తెచ్చుకున్న రామచంద్రయ్యకు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలవడం ఇష్టం లేదు. అయినా చిరంజీవి పట్ల ఉన్న ప్రేమతో ఆయన అంగీకరించారు. రాష్ట్రం విడిపోవడం... కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కావడంతో రామచంద్రయ్య మిన్నకుండిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి జీవం వస్తుందని చాలాకాలంగా వేచి చూశారు రామచంద్రయ్య. ఇదే అభిప్రాయంలో చిరంజీవి కూడా ఉన్నారు. అయితే వారి ప్లాన్ కు పూర్తి విరుద్ధంగా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో జతకట్టింది.
ఇదంతా చిరంజీవికి - రామచంద్రయ్యకు మింగుడు పడడం లేదు. దీంతో చిరంజీవే రామచంద్రయ్యతో మాట్లాడి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఒప్పించారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని - ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలుస్తుందని చిరంజీవి తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ముఖం ఎత్తుకోలేమని - దీనిని ద్రష్టిలో ఉంచుకునే ముందుగా రామచంద్రయ్యను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి పంపినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించదని తెలిసిన చిరంజీవి తన సన్నిహితులను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేర్పిస్తున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో మరి కొందరు చిరంజీవి సన్నిహితులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు.