Begin typing your search above and press return to search.
లుక్ టెస్ట్: ఎవరు బెస్ట్ ప్రధాని?
By: Tupaki Desk | 9 Jan 2019 8:59 AM GMTఒకే నాయకుడి పేరుతో మూడు నాలుగు బయోపిక్ లు తెరకెక్కడం అన్నది నేటి ట్రెండ్. నాయకులకు వీరాభిమానులు ఉంటారు కాబట్టి తమ ఫేవరెట్ లీడర్ బయోపిక్ తెరకెక్కించి ధన్యం అవ్వాలని తపించే ప్రయత్నం కనిపిస్తోంది. మరోవైపు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ నాయకుల బయోపిక్ లు సెంటిమెంట్ ని, ఎమోషన్ ని రాజేస్తాయనడంలో సందేహం లేదు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ జీవితంపై మూడు, నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. నేడు కథానాయకుడు రిలీజైంది. పార్ట్ 2 `మహానాయకుడు` రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగంధం తెరకెక్కుతున్నాయి. వైయస్సార్, థాక్రే వంటి నాయకులపై సినిమాలొస్తున్నాయి.
ఇటీవలే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రతిష్ఠాత్మకంగా బయోపిక్ ప్రారంభమైంది. వివేక్ ఒబేరాయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకకాలంలో 23 భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. అన్ని భాషల్లో ఒకేసారి సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. ప్రధాని గెటప్ లో ఒబెరాయ్ లుక్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. మోదీ పాత్రలో ఒబెరాయ్ పెర్ఫెక్ట్ యాప్ట్ అన్న ప్రశంసలు కురిసాయి. ఈ సీజన్ లో పలువురు నాయకుల బయోపిక్ లు తెరకెక్కుతుండడంతో ప్రధాని పాత్రకు ఇతర నాయకుల సినిమాల్లోనూ ఆస్కారం కనిపిస్తోంది.
తాజాగా వివేక్ ఒబేరాయ్ లుక్ కి ధీటుగా మోహన్ లాల్ లుక్ ఒకటి నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. లాల్ సాబ్.. మోదీ గెటప్ లో దర్శనమివ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. గజిని సూర్య నటిస్తున్న 37వ సినిమా `కప్పన్` లో ప్రధాని పాత్ర లుక్ ఇదని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మోదీ తరహాలోనే నెరిసిన గడ్డం, కుర్తా, జాకెట్ స్టైల్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి రంగం ఫేం కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక మోదీ బయోపిక్ తో పాటు శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు `థాక్రే` (బాల్ థాక్రే) బయోపిక్ లో ప్రధాని పాత్ర కు ఆస్కారం ఉందా? ఉంటే ఆ పాత్ర ఇంకా రివీల్ కావాల్సి ఉంది. అలాగే అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న `ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్` చిత్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర లుక్ ఆకట్టుకుంది. అనుపమ్ ఖేర్ పర్ఫెక్ట్ గా సూటయ్యారన్న ప్రశంసలు దక్కాయి. ఇకపోతే మన్మోహన్ రాజకీయ జీవితం ఆద్యంతం అపోజిషన్ లీడర్ మోదీ పాత్ర విస్మరించలేనిది. ఇంతకీ ఈ చిత్రంలో మోదీ పాత్రధారి ఎవరు? అన్నది ఇంతవరకూ రివీల్ కాలేదు. ఈ లుక్ లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.