Begin typing your search above and press return to search.
బీజేపీ ప్రధాని అభ్యర్ధి ఎవరంటే...?
By: Tupaki Desk | 8 Jan 2023 3:30 AM GMTకేంద్రంలో బీజేపీ ఇప్పటికి రెండు సార్లు బహు చక్కని విజయాలతో అధికారాన్ని చేపట్టింది. తొమ్మిదేళ్ళ పాలన పూర్తి కావస్తోంది. 2024లో మరోసారి ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైనవి. ఈసారి బీజేపీ గెలిస్తే కనుక తన టార్గెట్ అయిన 2047 దాకా అధికారంలో ఎలా ఉండాలో అజెండాను సెట్ చేసి పెట్టుకుంటుంది. విపక్షాలను మరింతగా వీక్ చేసి పారేస్తుంది.
అందువల్ల బీజేపీ వేయని ఎత్తులు ఉండవు. ఇక ఇప్పటికి రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోడీ ఇమేజ్ తోనే 2024లోనూ బీజేపీ ఎన్నికలకు వెళ్తుంది అని అంటున్నారు. అయితే 2024లో ప్రధాని మోడీ బదులుగా చాలా మంది పేర్లు ఆ పార్టీలో చాలా కాలంగా వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీని పక్కన పెట్టి ఈసారి కొత్త వారికి చాన్స్ ఇస్తారని ఆరెస్సెస్ కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు.
ఇక కేంద్రంలోనూ బీజేపీలోనూ చూస్తే మోడీ తరువాత ప్లేస్ లో ఉన్న అత్యంత శక్తిమంతుడు అయిన నాయకుడు అమిత్ షా ప్రధాని రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈ తరహా ప్రచారానికి చెక్ పెడుతూ అమిత్ షా చత్తీస్ ఘడ్ తాజా టూర్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. 2024లో ప్రధానిగా మరో మారు ప్రధాని నరేంద్ర మోడీయే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. మోడీ కంటే సరిసారి నేత దేశంలో ఎవరూ లేరని చెప్పుకొచ్చారు.
నరేంద్ర మోడీకి విదేశాలలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఆయన కూడా దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసేలా ఏ దేశమేగినా హిందీలోనే మాట్లాడుతూ భారత మాతకు వన్నె తెస్తున్నారని కొనియాడారు. మరోసారి మోడీ ప్రధాని కావాలంటే కచ్చితంగా చత్తీస్ ఘడ్ ప్రజలు బీజేపీకి ఓటేసి 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు.
చత్తీస్ ఘడ్ లో బీజేపీ విజయం ఖాయమని కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలే తమను గెలిపిస్తాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత బీజేపీదే అని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ చత్తీస్ ఘడ్ లో అశాంతిని రూపుమాపడంలో విజయవంతం అయిందని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే చత్తీస్ ఘడ్ తో పాటు తెలంగాణా రాజస్థాన్ లలో బీజేపీ విజయఢంకా మోగిస్తుంది అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే ఇదే ఏడాది ఏకంగా దేశంలో ఎనిమిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇక ఈ ఎన్నికలు కూడా రెండు భాగాలుగా జరుగుతాయి. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తొలి అయిదింటికీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే మరో మూడింటికి ఈ ఏడాది రెండవ భాగంలో ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది జరిగే అన్ని అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా బీజేపీ సహా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశాయి. అమిత్ షా ఇపుడు చత్తీస్ ఘడ్ లో అందుకే దూకుడు చేస్తున్నారు. మొత్తానికి ఆయన చెప్పే మాట ఏంటి అంటే మరోసారి ప్రధానిగా బీజేపీ తరఫున మోడీయే ఉంటారని.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.