Begin typing your search above and press return to search.
బాబు ఫేవరేట్ ఎంపీ
By: Tupaki Desk | 19 Dec 2021 8:45 AM GMTచంద్రబాబు స్వతహాగా పనిమంతుడు. ఆయనకు పనిచేసేవారు అంటే బాగా ఇష్టం. ఆయన రాజకీయం, ప్రజా సేవ ఊపిరి అని కూడా చెప్పాలి. ఆయన మొత్తం జీవితాన్ని దానికే అంకితం చేశారు. అలాంటి బాబుకు పోచుకోలు కబుర్లు చెప్పేవారి కంటే కూడా కష్టించి పనిచేసే వారే ఇష్టం. అలాంటి వారే ఆయన మనసుకు నచ్చుతారు. అంతే కాదు, పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ కష్టకాలంలో నా బోందో అని పనిచేసే వారు అంటే బాబుకు మహా ఇష్టం. అయితే బాబు తన మనసులోని భావాలను ఎపుడో కానీ బయటపెట్టుకోరు.
ఆయన ఎపుడూ ఎక్కడా అసలు బయటపడరు కూడా. కానీ బాబు అతి కొద్ది మంది విషయంలో ఇక ఏదీ దాచుకోలేక అలా బయటకు చెప్పేస్తుంటారు. అలాంటి లక్ ని సొంతం చేసుకుంది ఎవరో కాదు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు. ఆయన అంటే బాబుకు ప్రత్యేకమైన అభిమానం. అప్పట్లో టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించినపుడు చంద్రబాబు ఒకే ఒక మాట అన్నారు. నా కుడి భుజం విరిగిపోయింది అని.
ఆ సమయంలో శ్రీకాకుళం జిల్లా పార్టీకి దిక్కు ఎవరు అని కూడా ఆయన ఆలోచించారు. ఇక ఎన్నికల వేళ వారసుడు అన్న ఒకే ఒక్క కారణంతో రామ్మోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. అయితే దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీ వాయిస్ గా మారి పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడిన ఘనత మాత్రం రామ్మోహన్ దే అని చెప్పాలి. ఆయన ఈ ఏడేళ్ల వ్యవధిలో ఎంత గుర్తింపు పొందారంటే ఏపీ నుంచి ఎందరు ఎంపీలు గెలిచినా కూడా ఆయనను ప్రధాని సహా కేంద్ర మంత్రులు అంతా ఇట్టే గుర్తుపడతారు. ఆయన మాట్లాడుతూంటే వారు ఆసక్తిగా వింటారు.
ఇక 2018 లో పార్లమెంట్ లో టీడీపీ అవిశ్వాసం మోడీకి వ్యతిరేకంగా ప్రవేశపెడితే హిందీలో అద్భుతంగా మాట్లాడి నాటి మోడీ సర్కార్ తప్పులను ఎత్తి చూపిన యువ నేతగా రామ్మోహన్ అందరి మన్ననలూ పొందారు. ఈ రోజుకీ ఆయన ప్రత్యేక హోదా మీద కానీ విశాఖ రైల్వే జోన్ విషయం కానీ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద కానీ పార్లమెంట్ లో తన గళాన్ని బలంగా వినిపిస్తూనే ఉన్నారు.
ఇక తాజాగా ఆయన పుట్టిన రోజు వేళ చంద్రబాబు ప్రత్యేకంగా కొనియాడుతూ చేసిన ట్వీట్ అయితే టీడీపీలో పెద్ద చర్చగా ఉంది. రామ్మోహన్ ముందు ముందు అనేక ఉన్నత పదవులు అందుకోవాలని చంద్రబాబు దీవించారు అంటేనే ఈ యువ నేత జాతకం ఎలా వెలిగిపోబోతోంది అన్నది అర్ధమవుతోంది. ఆయన బాబాయ్, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నా యువ నేతగా రామ్మోహన్ మీదనే చంద్రబాబు ఆశలు ఆకాంక్షలూ అన్నీ అంటారు.
గతంలో ఎర్రన్నాయుడు కేవలం జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు, ఉత్తరాంధ్రాలోనే తన ప్రభావాన్ని చూపించారు. అలా వచ్చే ఎన్నికల నాటికి రామ్మోహన్ కూడా తన టాలెంట్ తో మూడు జిల్లాల్లో టీడీపీని గెలిపించి ఒడ్డున పడేస్తారు అన్న ఆశ, ధీమా బాబులో ఉన్నాయి. మరి రామ్మోహన్ కూడా టీడీపీ గెలుపు అనివార్యమని చెబుతూ ఇంతటి విపత్కర వేళలో కూడా పార్టీకి ఆశాకిరణంగా ఉన్నారు. నిజంగా ఉత్తరాంధ్ర వైసీపీకి రామ్మోహన్ లాంటి నాయకులు కొరకరాని కొయ్య మాదిరిగానే ఉన్నారని గట్టిగా చెప్పవచ్చు. చూడాలి మరి వచ్చే ఎన్నికల నాటికి రామ్మోహన్ సైకిల్ జోరు మూడు జిల్లాలలో ఎలా సాగుతుందో.