Begin typing your search above and press return to search.
హూజూరాబాద్ కాంగ్రెస్ బరిలో 'ఆ నలుగురు?'
By: Tupaki Desk | 8 Aug 2021 5:51 AM GMTతెలుగు రాష్ట్రాల చూపు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే ఉంది. ఇక్కడ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ వెలువడకముందే రాజకీయం వేడెక్కింది. అభ్యర్థులు ఖరారు కానప్పటికీ పార్టీల మధ్యే యుద్ధం జరుగుతోంది. అయితే బీజేపీ నుంచి ఈటల దాదాపు ఖరారు అయినప్పటికీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అభ్యర్థిపై ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. ఈటలకు ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ నాయకులు వ్యూహ రచన చేస్తున్నారు. నియోజకవర్గంలో దళిత, బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని రంగంలోకి దింపనున్నారు. ఇరు పార్టీలు పలు పేర్లు పరిశీలించిన తరువాత కొందరిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల ఇప్పటికే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. మోకాలి నొప్పితో కొంత గ్యాప్ ఇచ్చినా మళ్లీ మొదలు పెడుతున్నట్లు ప్రకటించాడు. దీంతో బీజేపీ నుంచి ఈటల పోటీ ఖాయమేనని తెలుస్తోంది. తనను ప్రభుత్వం నుంచి భర్తీ చేసినందుకు ప్రజలే ఆదరిస్తారంటూ ముందుకు వెళ్తున్నారు. ఈటల పాదయాత్రకు కొందరు మద్దుతు ఇస్తూ ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తాను చేయబోయేది చెబుతున్నాడు.
ఇక టీఆర్ఎస్ ఇప్పటికే దళిత బంధు పథకంలో ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నియోజకవర్గానికి చెందిన నేతకే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మరోవైపు దళిత కాలనీల్లోప్రత్యేక అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కౌశిక్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకే టికెట్ కన్ఫామ్ అని అనుకున్నారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఖరారు చేయడంతో ఆయన అభ్యర్థిత్వంపై ఉత్కంట తొలిగిపోయింది. ఆ తరువాత లోతుగా పరిశీలించి అధిష్టానం దళిత సామాజిక వర్గ నేతనే బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు టీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ పరిణామాల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై పార్టీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈటలకు సరైన నాయకుడిని రంగంలోకి దించాలని ప్రణాళిక వేస్తున్నారు. అయితే ఇప్పటికే దళిత అభ్యర్థినే పోటీలో ఉంచాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా దామోదర రాజనర్సింహ పేరు వినిపించింది. కానీ ఆయన పోటీలో లేనని ప్రకటించారు. ఇక ఆ తరువాత కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వరంగల్ కు చెందిన దొమ్మాటి సాంబయ్య పేర్లు వినిపించాయి.
కానీ అనూహ్యంగా కొండా దంపతుల పేర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ అభిమానులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన కొండా దంపతులు మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో కాంగ్రెస్ తరుపున గెలిచిన కొండా సురేఖ ఆ తరువాత గులాబీ పార్టీలో చేరి 2018లో టికెట్ దక్కించుకోలేకపోయారు. దీంతో తిరిగి కాంగ్రెస్లోకి మారారు. తాజాగా రేవంత్ రెడ్డి అధ్వర్యంలో పార్టీలో ఊపు రావడంతో హుజూరాబాద్ టికెట్ కోసం కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ బరిలో దిగనుందా..? అనే ప్రచారం సాగుతోంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మేల్యేగా చేశారు.ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు. వరంగల్ రాజకీయాలను శాసించిన వీరు టీఆర్ఎస్ హయాంలో మాత్రం స్తబ్ధంగా ఉండిపోయారు. అయితే రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాగానే వారిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు కొండా దంపతులు సంకేతాలు పంపినట్లు సమాచారం.