Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ బరిలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ?
By: Tupaki Desk | 8 Aug 2021 9:41 AM GMTఉప ఎన్నికపై ఇంకా నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీ అభ్యర్థులు ఖరారు కాకముందే పార్టీలు ప్రచారాన్ని ఉధ్రుతం చేస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లేదా ఆయన భార్య జమున పేర్లు వినిపిస్తుండగా.. టీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురి పేర్లు కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త పాలకవర్గంతో ఉప ఎన్నికలో దిగుతున్న కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఇంట్రెస్టు చూపుతున్నారు. దీంతో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని భట్టి మిగతా రెండు పార్టీలు తమ క్యాండెట్ ను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఈటల రాజేందర్ బర్తరఫ్ కావడంతో.. కొన్ని రోజుల తరువాత ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో 6 సార్లు గెలిచిన ఈటల మరోసారి బీజేపీ తరుపున పోటీ చేసే అవకాశాలే ఏక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే కొన్ని రోజుల కిందట ఏదైనా మార్పు జరిగితే ఆయన భార్య జమున కూడా పోటీలో ఉండొచ్చని అంటున్నారు. అయితే మొత్తంగా ఈటల రాజేందర్ పేరు మాత్రమే వినిపిస్తోంది.
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే దళిత బంధు పేరిట ఓ పథకాన్ని హుజూరాబాద్ కోసమే వెలుగులోకి తెచ్చారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టిన అధిష్టానం అభ్యర్థిని కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఉంటారని ప్రచారం సాగుతోంది.
ఒకవేళ అదే నిర్ణయమైతే గెల్లు శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదీ కాగా బీసీలకు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంటే వకుళాభరణం, ఎల్.రమణ, పొనగంటి మల్లయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఓసీలకు ఇవ్వాలనుకున్నా పెద్దిరెడ్డి, మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న పాడి ఉదయానందరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డికి టికెట్ వస్తుందని అనుకున్నా.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయం చేయడంతో ఆయన పోటీలో ఉండే అవకాశం కనిపించడం లేదనే తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ప్రకటించగానే ఈ పార్టీ కూడా దళిత ఓట్లు చీల్చడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. ఇందులో భాగంగా దామోదర్ రాజనర్సింహా పేరు వినిపించింది. కానీ ఆయన పోటీ చేయననడంతో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఉండొచ్చని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటిస్తే పొన్న ప్రభాకర్ ను నిలబెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన కూడా పోటీలోలేనని తెలపడంతో కొండా సురేఖకు ఇచ్చే అవకాశ ఉందని చర్చించుకుంటున్నారు.
అభ్యర్థులెవరని తేలముందు పార్టీ నాయకులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ దళిత, బీసీ ఓట్లను పోనియకుండా కసరత్తు చేస్తోంది. ఈటల రాజేందర్ పాదయాత్ర చేపడుతూ ప్రతీ గ్రామంలోని ప్రజలను కలుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు సైతం రోజుకో కార్యక్రమం చేపడుతూ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలే ఏ పార్టీలకి పట్టం కడుతారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.