Begin typing your search above and press return to search.
జగన్ భజనతో పరువు తీస్తోందెవరు? ఎందుకు?
By: Tupaki Desk | 30 Jan 2021 2:30 AM GMTరాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది(పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామస్థాయిలో). ఈ విషయం సామా న్యులకు కూడా తెలుసు. అయితే.. ఉన్నత చదువులు చదివిన అధికారులకు, సుదీర్ఘ కాలంగా రాజకీయా ల్లో చక్రాలు తిప్పుతున్న వైసీపీ మంత్రులకు తెలియదని అనుకోవాలా? లేక ఉద్దేశ పూర్వకంగానే రెట మతంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలా? లేక ఇవన్నీ కాదు.. సీఎం జగన్ భజనను మానలేక పోతున్నా రని సరిపుచ్చుకోవాలా? ఇదే చర్చ అధికార వైసీపీలోనే జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఇది కీలక సమయం. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. పథకాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది.
ఆయా పథకాల ఫలాలను ప్రజలు అనుభవించారు. మరి.. ప్రభుత్వానికి, ప్రభుత్వ పార్టీకి కూడా ఆయా సంక్షేమ ఫలాలు అందాలిగా! అది కేవలం ఓట్లరూపంలోనే అందుతుంది. అవి పంచాయతీ ఎన్నికలైనా.. సార్వత్రిక ఎన్నికలైనా.. ప్రభుత్వ కష్టానికి దక్కే ప్రతిఫలం ఓట్లే! ఈ క్రమంలో అటు అధికారులు.. ఇటు మంత్రులు కూడా సంయమనం పాటించి.. ప్రభుత్వానికి మైనస్‌లు పడకుండా చూసుకోవాల్సిన అవసరం వారికి తెలయదని అనుకోలేం. కానీ.. జరుగుతున్న పరిణామాలు చూస్తే.. తెరవెనుక.. ఏదో జరుగుతోందనే భావన వ్యక్తమవుతోంది. సీనియర్ మంత్రులే కట్టుతప్పుతున్నారు. సీనియర్ అధికారులే భజనకు వెనుకాడడం లేదు.
తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే.. ఒకరిద్దరు మంత్రులు, అధికారులు.. ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న వ్యవహారాలు.. తిరిగి.. జగన్ మెడకే చుట్టుకుంటున్నాయి. పైకి.. జగన్ పక్షాన తాము పనిచేస్తున్నామని చెప్పుకొనేందుకు బాగున్నా.. ప్రజాక్షేత్రంలోకి వచ్చేసరికి నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా ఇటవల చెప్పుకొచ్చారు. ``ఇప్పటి వరకు జరిగింది జరిగింది. ఇకపై నాపై వ్యక్తిగత విమర్శలు వద్దు. అలా చేస్తే.. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకుంటాను` అన్నారు. అయినా.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి దూకుడు తగ్గించలేదు.
నిమ్మగడ్డపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక, అధికారులకు కూడా కోడ్ ఉందని తెలుసు. అయినా.. లెక్క చేయడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రెసిడెంట్ పత్రాలు, నో డ్యూస్ పత్రాలు వంటివాటిపై సీఎం జగన్ బొమ్మలతో ఉన్నవాటికే ఇస్తున్నారు. నిజానికి ఇది.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఈ విషయం తెలిసికూడా.. అధికారులు ఇలా చేస్తున్నారంటే.. ఏమనాలి? జగన్‌పై భక్తి ఉండొచ్చు.. కానీ, ఆయన కాళ్ల కిందకే నీళ్లు తెచ్చేలా వ్యవహరిస్తుండడం ఎంత వరకు సమంజసం? అనేది ప్రశ్న. మరి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బెటర్ అంటున్నారు పరిశీలకులు.