Begin typing your search above and press return to search.
దివ్యవాణి ఎవరు...?
By: Tupaki Desk | 2 Jun 2022 9:30 AM GMTగత రెండు రోజుల నుంచి టీవీలలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. అదేంటీ అంటే దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేశారు అని. అలాగే చంద్రబాబు ఆమెను పిలిచి బుజ్జరించారు అని. ఇక ఇపుడు చూస్తే మళ్లీ దివ్యవాణి రాజీనామా అని. ఇక ఇపుడు చేసినది అఫీషియల్ రాజీనామ అని ఆమె స్వయంగా వీడియో విడుదల చేశారు. ఇక తానుగా పెట్టిన మీడియా సమావేశంలో కూడా ఆమె ఆ సంగతి చెప్పారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు ఉన్న కుర్రకారుకు ఈమె అసలు ఎవరు అన్న పెద్ద ప్రశ్న వస్తోందిట.
ఇక ఆమెకు ఎందుకు ఇంత టీవీలలో స్క్రోలింగ్ అని కూడా ఆశ్చర్యపోయేవారు ఉన్నారు. ఇంకో వైపు చూస్తే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీడీపీ వర్సెస్ వైసీపీగా అతి పెద్ద యుద్ధమే సాగుతోంది. ఇలా ఆమె గురించి ఇంతలా చర్చించడానికి ఆమె ఎమ్మెల్యే కాదు, పార్టీకి నాలుగు ఓట్లు సంపాదించే ఆమె అంతకంటే కాదు. అలాగని స్వచ్చంద సేవా కార్యక్రమాలు ఏమైనా చేసిందా అంటే లేదు.
మరి ఆమె మీద ఎందుకు అంత డిస్కషన్ అన్నదే ఇపుడు అందరిలోనూ ఉంది. అయితే ఆమెకు మహానాడులో అవమానం జరిగింది అని అందుకే రాజీనామా చేస్తున్నారు అని చెప్పినట్లుగా పేర్కొంటున్నారు. ఇక రాజకీయాలు చూస్తే ఎవరినైనా బొట్టు పెట్టి పిలిచే సీన్ అయితే ఉండదు, ఎవరైనా దూసుకుపోవాలి. తామే అవకాశాలను కలుగచేసుకొవాలి.
అలా కాకుండా అలిగి రాజీనామా డ్రామాలతో నాకు ఏదో ప్రచారం వస్తుంది అని అనుకుంటే మాత్రం రాజకీయాల్లో పరిపక్వత లేదు అనే అనాలి. ఇక చూస్తే దివ్యవాణి లాంటి వారికి రాజకీయాలు ఏమీ తెలియవు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక చూస్తే చంద్రబాబు ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచి మాట్లాడారు కదా, ఆమెకు ఇంకా ఏమి కావాలని కూడా అంటున్నారు. ఇక చంద్రబాబు పోస్ట్ ఏమైనా ఆమెకు కావాలా అని కూడా పార్టీ వర్గాలు వ్యంగ్యంగా అంటున్నాయి.
ఆమె వల్ల మాకు ఓట్లు ఏవీ పోవడం లేదని, మేము మహానాడు సక్సెస్ అయి దాన్ని ఎంజాయ్ చేస్తూంటే దివ్యవాణి వచ్చి డిసర్బ్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇక ఆమెను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదని కూడా టీడీపీ వర్గాలు అంటున్నాయట. ఇక దివ్యవాణి పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా పొంతన లేని విధంగా మాట్లాడం ద్వారా తనకు రాజకీయ అనుభవం లేదని నిరూపించుకున్నారని అంటున్నారు.
పార్టీలో ఎవరైనా అవకాశాలు అందిపుచ్చుకోవాలి. వారి ప్రతిభను బట్టే అవి వస్తాయి. ఈ విషయంలో ఎవరో తొక్కేస్తున్నారు అని మధనపడడం అంటే అది పూర్తిగా వారి మీద వారికి నమ్మకం లేకపోవడమే అని కూడా అంటున్నారు. మొత్తానికి దివ్యవాణి ఎపిసోడ్ ని టీడీపీ వర్గాలు లైట్ తీసుకుంటున్నాయి అనే అంటున్నారు.