Begin typing your search above and press return to search.

అటు ఇటు తిరిగి వెంకయ్యకే యోగం...?

By:  Tupaki Desk   |   21 Jun 2022 8:53 AM GMT
అటు ఇటు తిరిగి వెంకయ్యకే యోగం...?
X
దేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరు అన్నది ఇప్పటిదాకా తేలని అంశంగా ఉంది. ఈ విషయంలో విపక్ష శిబిరం అయితే గందరగోళంలో ఉంది. చివరికి మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్ హాను ప్రకటించబోతున్నాయి. ఆయన వాజ్ పేయ్ ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ చూశారు. బీజేపీతో చాలా ఏళ్ళు పనిచేశారు. అనేక మంది బీజేపీ నేతలతో ఈ రోజుకీ సన్నిహిత సంబంధాలు యశ్వంత్ కి ఉన్నాయి.

ఈ నేపధ్యంలో లేట్ గా అయినా లేటెస్ట్ గానే విపక్షం ఒక గట్టి నిర్ణయమే తీసుకుంది అని అంటున్నారు. దీని వల్ల బీజేపీకి కొంత ఇరకాటం తప్పకపోవచ్చు అని కూడా ఊహిస్తున్నారు. యశ్వంత్ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఆయనకు అధికార పార్టీలో ఉన్న పరిచయాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా అన్న మాట కూడా ఉంది. ఇక యశ్వంత్ యంటీ మోడీ ఫిలాసఫీ కూడా బహు గట్టిది. ఆ ఫిలాసఫీకి ఆకట్టుకునే వారు అధికార పార్టీలో ఉంటే కమలానికి కొంత కలవరమే అని చెప్పాలి.

దీంతో విపక్ష శిబిరం క్యాండిడేట్ దాదాపుగా తెలైపోవడంతో బీజేపీ కూడా తమ కసరత్తుని ముమ్మరం చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ ఇప్పటిదాక కొన్ని పేర్లను ముందు పెట్టుకుందని ప్రచారం అయితే సాగింది కానీ సడెన్ గా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైపు చూస్తోంది అన్న మాట వినిపిస్తోంది. ఆయనను ముందు పెడితే అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉంటారని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

విపక్షం ఉమ్మడి అభ్యర్ధికి ధీటైన బదులు ఇచ్చేలా వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వం ఉంటుందని కూడా ఊహిస్తున్నారు. ఇక ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వం పట్ల టీడీపీ సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అయితే వెంకయ్యనాయుడు అభ్యర్ధిత్వాన్ని ప్రతిపాదించారు.

దేశంలో ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతులుగా అయిన సంప్రదాయం ఉంది అని ఆయన అంటున్నారు. వెంకయ్యనాయుడిది మచ్చలేని రాజకీయ వ్యక్తిత్వం అని కూడా అంటున్నారు. ఆయనకు కనుక ప్రకటిస్తే ఎన్నిక ఉండదని ఏకగ్రీవం కూడా అయ్యే పరిస్థితి ఉంటుందని కూడా అంటున్నారు. చేతిలో ఉప రాష్ట్రపతిని ఉంచుకుని కొత్త అభ్యర్ధి కోసం వెతుకులాట ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అయితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని కూడా ఆయన చెప్పడం విశేషం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీకి పెద్ద దిక్కు ప్రభుత్వంలో మోడీ తరువాత అంతటి నాయకుడు అయిన అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వెంకయ్యనాయుడుని కలవడం కీలక పరిణామంగా చూడాలి.

కొద్ది గంటలలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగబోతూండంగా వీరిద్దరూ వెంకయ్యనాయుడుని కలవడం ఆసక్తికరమైన పరిణామగానే చూడాలి. మరి వ్యవహారం చూస్తే అటూ ఇటూ తిరిగి బీజేపీ అభ్యర్ధి వెంకయ్యనాయుడు అవుతారా అన్న చర్చ కూడా ఉంది.