Begin typing your search above and press return to search.

తెలంగాణ‌ లో ఎవరు హ్యాపీ?

By:  Tupaki Desk   |   2 Jun 2022 6:31 AM GMT
తెలంగాణ‌ లో ఎవరు హ్యాపీ?
X
ప్రాంతాలు వేర‌యినా తెలుగు జాతి ఒక్క‌టే అనే నినాదం ప్ర‌జ‌ల క‌న్నా, ప్ర‌జ‌ల‌ను న‌డిపే యంత్రాంగం క‌న్నా, ప్ర‌జ‌లు ఎన్నుకునే పార్టీల‌కూ, వారి కాంట్రాక్ట‌ర్ల‌కూ బాగానే ఉప‌యోగ‌ప‌డుతోందంటున్నారు విమర్శకులు. ఆ విధంగా తెలంగాణలో ఆంధ్రా ప్రాంత పార్టీల మూలాలు ఉన్న నాయ‌కులు అంతా బాగానే ఉన్నారు. కానీ వారు ప్ర‌జ‌ల అభివృద్ధికి ఏం చేస్తున్నారు.

అభివృద్ధి అంటే జీవ‌న ప్ర‌మాణాల వృద్ధికి ఏంచేస్తున్నారు అన్న‌దే ముఖ్యం. మొన్న‌టి ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా టీఆర్ఎస్ అంటే టీడీపీ... అని చింత‌మ‌నేని అన్నారు.

నిజంగానే ఆ నిర్వ‌చ‌నం మేర‌కు అక్క‌డి నాయ‌కులు ఉన్నారు. బాగుంది కానీ వాళ్లేం చేస్తున్నారు అన్న‌దే కీల‌కం. ప‌దవులు ద‌క్కాక వారంతా ఏ విధంగా ఉన్నారు అన్న‌దే ముఖ్యం. ఆ రోజు ఉద్య‌మంలో లేని వారంద‌రూ కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నార‌న్న‌ది ఓ విమర్శ. ఇది కొొంతవరకు నిజమే.

ఓయూలో కూడా నిర‌స‌న‌లు వినిపించ‌డం లేదు. వినిపించినా అప్ప‌టిలా వారికి స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణం లేదు. ఏ విధంగా చూసుకున్నా ఓ కులం ఓ శ్రేణి ఓ వ‌ర్గం బాగానే ఉంద‌న్న వాద‌న ఓయూ జేఏసీ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఎవ‌రిది ? త్యాగాలు ఎవ‌రికి ? ఈ రెండు ప్ర‌శ్న‌ల చుట్టూనే రాజ‌కీయం తిరుగుతోంది.

వాస్త‌వానికి తెలంగాణ నాయ‌కుల వెర్షన్ ఏంటంటే... ఉమ్మ‌డి పాల‌కులు అన్యాయం చేశారు అని. మ‌రి! దిద్దాల్సిన పాల‌కులు ఏం చేయాలి. ద‌ళిత ఓటు బ్యాంకు కోసం ద‌ళిత బంధు తెచ్చారు స‌రే ! మ‌రి! ఎస్సీ కార్పొరేష‌న్ ఏమ‌యింది. స‌బ్ ప్లాన్ నిధులు ఏమ‌య్యాయి. వీటి గురించి కూడా మాట్లాడాలి. కాళేశ్వ‌రం అనే ఎ త్తిపోత‌ల ప‌థ‌కానికి ఎవ‌రు సాయం ప‌ట్టారు.

నీళ్ల కు సంబంధించి ఖ‌ర్చు చేసిన నిధులు ప‌క్క‌దోవ ప‌ట్టించారు. వీటిపై కూడా మాట్లాడాలి. అంతేకాదు హైద్రాబాద్ చుట్టూనే అభివృద్ధి అని చెబితే స‌రిపోతుందా మురికి వాడ‌లలో ఉన్న స‌మ‌స్య‌ల జాడ్యాన్నీ సంబంధిత మురికినీ తొల‌గించేది ఎవ‌రు ? వారికి క‌నీస వ‌స‌తులు ఇచ్చేది ఎవ‌రు? వీట‌న్నింటి గురించి ఆలోచించాకే తెలంగాణ ఏర్పాటుకు సార్థకత చేకూరుతుందంటున్నారు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కదా అందుకే అన్ని వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి.