Begin typing your search above and press return to search.
దేవినేని అవినాష్‌కు దెబ్బేస్తోందెవరు... బెజవాడ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది...!
By: Tupaki Desk | 27 April 2022 11:30 AM GMTవిజయవాడ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న దేవినేని నెహ్రూ వారసుడిగా.. ఆయ న కుమారుడు, యువ నేత.. దేవినేని అవినాష్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. పార్టీ లో యువ నాయకుడిగా దూకుడు చూపిస్తున్నారు. ఈయనకు సీఎం జగన్ నుంచి కూడా మంచి గుర్తింపు ఉంది. దీంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఆయన మంచి పనితీరు కనబరుస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కీలక ప్రాంతాల్లో పట్టు సాధించారు.
కొండ ప్రాంతాల వారికి ఇళ్లు, నీళ్లు.. రేషన్.. ఇలా అన్ని సౌకర్యాలు అందేలా.. అవినాష్ ప్రయత్నాలు చే స్తున్నారు. అవినాష్ నియోజకవర్గంలో పార్టీ పరంగా, ప్రభుత్వ కార్యక్రమాల పరంగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం వద్ద అవినాష్ సక్సెస్ కూడా అవుతున్నారు.
ఇక, అవినాష్ సేవలకు.. సీఎం జగన్ ఫిదా అవుతున్న విషయం తెలిసిందే. దీంతో జగన్ నిర్వహించే కార్యక్రమాల్లో అవినాష్‌కు ప్రత్యేక ఇన్విటేషన్ కూడా అందుతున్న విషయం తెలిసిందే. ఇంత జోరుగా ఉన్న అవినాష్‌కు కూడా ఇప్పుడు ఓ వర్గం నేతలు సెగపెడుతున్నారని అంటున్నారు. అది కూడా.. అవినాష్ సొంత సామాజికవర్గం నేతలే.. కావడంపై పార్టీలోనూ.. బయట కూడా విస్తృతంగా చర్చసాగుతోంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ వరుస విజయాలు దక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. సత్తా నిరూపించు కునేందుకు అవినాష్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గంలో సైతం అవినాష్ చాలా వరకు చీలిక తెచ్చి సక్సెస్ అయ్యారు.
అయితే.. అవినాష్ గెలుపు గుర్రం ఎక్కితే.. టీడీపీలో ఉన్న కమ్మ వర్గం ఇబ్బందుల్లో పడుతుందనే ఒక వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. దీనికి అనుగుణంగానే ఈ సామాజికవర్గం ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతోందనే వాదన వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని గెలిపించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న మాట. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. మరి అవినాష్ దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.