Begin typing your search above and press return to search.
అధికార దాహం: శివసేనదా? బీజేపీదా?
By: Tupaki Desk | 23 Nov 2019 10:53 AM GMTకేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. మొన్ననే శివసేన గ్రూపుకట్టడం చూసి రాష్ట్రపతి పాలన విధించింది. ఇప్పుడు పొత్తులు కొలిక్కి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేన సిద్ధమవ్వగా బీజేపీ అర్ధరాత్రి మేల్కొంది. ఎన్సీపీని చీల్చి మహరాష్ట్రలో గద్దెనెక్కింది. రాష్ట్రపతి పాలనను ఒక్క సంతకంతో రద్దు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది.
నిజానికి కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి బలం.. బలగం.. శివసేనకు ఇదే మైనస్. రాష్ట్రపతి పాలన విధించడం.. తీసేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. శివసేనకు కాదు.. అయినా బీజేపీతో కొరివితో తలగొక్కుంది. తొడకొట్టింది. తనను తాను శివసేన ఎక్కువగా ఊహించుకుంది.
ఈ టోటల్ ఎపిసోడ్ లో శివసేనను ఏప్రిల్ ఫూల్ చేసింది బీజేపీ. తన సోదర, సమానమైన పార్టీ శివసేనను బీజేపీ చెడుగుడు ఆడేసుకుంది.
మహారాష్ట్ర ఎన్నికల వేళ పొత్తు ప్రకారం కలిసి పోటీచేసిన బీజేపీ, శివసేనలు ఆ పొత్తు ధర్మం ప్రకారం మహారాష్ట్రలో అధికారం చేపట్టాలి.కానీ శివసేన గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాక రాష్ట్రపతి పాలనకు దారితీసింది. హిందుత్వ శివసేన, బీజేపీలో ఇలా కలహించుకోవడమే సంచలమైంది.
అయితే హిందుత్వ శివసేన పార్టీ తన సహజ సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చి సెక్యూలర్ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలవడాన్ని హిందుత్వ వాదులు, బీజేపీ, శివసేన సానుభూతిపరులు కూడా జీర్ణించుకోలేదు. శివసేన అధికార దాహం కోసం పార్టీ సిద్ధాంతాలను కూడా పక్కనపెట్టిన వైనం ప్రజల్లో వ్యతిరేకభావాన్ని నింపింది. అంతిమంగా శివసేన వైఖరిపై ప్రజల్లో నేతల్లో ఏహ్యభావం చెలరేగాక బీజేపీ చక్రం తిప్పింది.
శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించిన రోజు రాత్రే పరిణామాలు వేగంగా మారిపోయాయి. బీజేపీ పెద్దలు ఎన్సీపీని చీల్చి మహారాష్ట్రలో ఏకంగా పొద్దున సరికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
శివసేన అధికార దాహం చివరకు మంచి మిత్రులను దూరం చేసుకుంది. ఇప్పుడు శివసేనకు అటు అధికారం దక్కలేదు. ఇటు మిత్రుడైన బీజేపీ దూరం జరిగింది. రెంటికి చెడ్డ రేవడిలా ఆ పార్టీ మిగిలిపోయింది. ఇక బీజేపీని వదలడానికి లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి ఒక రాష్ట్రాన్ని చేజిక్కించుకోలేకపోయామన్న బాధ పడకుండా ఎన్సీపీని అక్రమంగా చీల్చేసిన బీజేపీది కూడా సామ్రాజ్యవాదం అనడానికి వీల్లేదు. ఆ పార్టీదీ అధికార దాహమే.. కానీ డ్యామేజ్ మొత్తం శివసేనపై పడిపోయాక చల్లాగా మెల్లిగా ఒకే స్టెప్ తో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇలా రెండు హిందుత్వ పార్టీలు సైతం అధికారమనే చదరంగంలో ఎన్సీపీ ఇప్పుడు పావుగా వాడుకున్నాయి.