Begin typing your search above and press return to search.

దేశ ఆర్థికరథాన్ని నడిపించింది వీరే..

By:  Tupaki Desk   |   2 Feb 2020 9:17 AM GMT
దేశ ఆర్థికరథాన్ని నడిపించింది వీరే..
X
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఆమె, ఆమె టీం రెండు నెలలుగా తీవ్ర కసరత్తు చేశారు. బడ్జెట్ కొంత మోదం.. కొంత ఖేదంగా ఉంది. వ్యవసాయం, మౌళిక సదుపాయలకు కేంద్ర బడ్జెట్ పెద్ద పీట వేసింది.

అయితే నిర్మలా సీతారామన్ రూపొందించిన ఈ దేశ బడ్జెట్ లో ఐదుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ఆర్థిక మాంద్యం వెంటాడుతున్న దేశాన్ని ఆ ఉపద్రవం నుంచి కాపాడడానికి తమ మేధా శక్తిని ఈ ఐదుగురు ఆర్థిక వేత్తలు మథించారు. వారు ఎవరు? ఏం చేస్తుంటారనేది తెలుసుకుందాం.

కేంద్ర బడ్జెట్ లో నిర్మలకు వెన్నుదన్నుగా నిలబడ్డ బృందంలో ప్రధాన పాత్ర పోషించింది రాజీవ్ కుమార్, చక్రవర్తి, అజయ్ భూషణ్ పాండే, టీవీ సోమనాథన్, తుహిన్ కాంతా పాండే.. ఈ ఐఏఎస్, ఆర్థిక నిపుణులే కేంద్ర బడ్జెట్ ను రూపొందించారు.

నిర్మల టీంలో మొదటి వ్యక్తి రాజీవ్ కుమార్. ఈయన జార్ఖండ్ కేడర్కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చేయడంలో ఈయనే ఆధ్యుడు. రెండో వ్యక్తి అతను చక్రవర్తి. 1985 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేస్తున్నారు. ఇక మూడో వ్యక్తి అజయ్ భూషణ్. 1984 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్. ఐఐటీ ఇంజనీర్ గా చేసిన ఈయన ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ కార్యదర్శి. నాలుగో వ్యక్తి టీవీ సోమనాథన్ తమిళనాడుకు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్. వ్యయ విభాగాల కార్యదర్శిగా ఉన్నారు. ఐదో వ్యక్తి ఒడిషా కేడర్ కు చెందిన 1987 ఐఏఎస్ తుహిన్ కాంతా పాండే. పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఈ ఐదుగురే ఆర్థికమంత్రి నిర్మల కేంద్ర బడ్జెట్ ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థికమాంద్యం వేళ వీరు రూపొందించిన ఈ బడ్జెట్ నే నిర్మల పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.