Begin typing your search above and press return to search.
మహిళా డిప్యూటీ సీఎం ప్రత్యర్థి ఎవరు...?
By: Tupaki Desk | 4 Jan 2022 12:30 PM GMTఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో టీడీపీకి పెద్దగా బలం లేదనే చెప్పాలి. మొదట నుంచి ఆ ప్రాంతాల పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సత్తా చాటేది..కాంగ్రెస్ తర్వాత వైసీపీ సత్తా చాటుతుంది. అంతే తప్ప టీడీపీ పెద్దగా విజయాలు సాధించినట్లు కనిపించలేదు. 2014 ఎన్నికల్లో ఒక్క పోలవరం మినహా మిగిలిన అన్ని ఏజెన్సీ నియోజకవర్గాల్లోనూ వైసీపీయే గెలిచింది. ముఖ్యంగా కురుపాం లాంటి నియోజకవర్గంలో టీడీపీ సత్తా చాటలేకపోయింది. కురుపాం అంతకముందు నాగూరు నియోజకవర్గంగా ఉండేది..అప్పుడు టీడీపీ గెలిచింది ఒక్కసారే 1994లో మాత్రమే గెలిచింది.
ఇక 2009 తర్వాత కురుపాం ఏర్పాడ్డాక..టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గత రెండు పర్యాయాలు వైసీపీ తరపున పుష్పశ్రీ వాణి గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే రెండున్నర ఏళ్లలోనే పుష్పశ్రీపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఆమె మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయ్యారని సర్వేలు వస్తున్నాయి. ఆమెను ప్రక్షాళనలో మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇలా వైసీపీలో వ్యతిరేకత ఉన్నా సరే అది ఉపయోగించుకునే స్థితిలో టీడీపీ లేదు. అసలు ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం కనిపించడం లేదు.
ఇక్కడ గత రెండు ఎన్నికల నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోతూ వస్తున్న జనార్ధన్ థాట్రాజ్ మొన్న ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత జనార్ధన్ తల్లి నరసింహప్రియ థాట్రాజ్ కూడా మరణించారు. ఇక జనార్ధన్ మేనమామ, సీనియర్ నేత శతృచర్ల విజయరామరాజు నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే వయసు మీద పడటంతో ఆయన యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. ఇక శతృచర్ల సోదరుడు చంద్రశేఖర్ రాజు కోడలే పుష్పశ్రీ వాణి అనే సంగతి తెలిసిందే.
అయితే పుష్పశ్రీకి ధీటైన అభ్యర్ధిని నిలబెట్టడానికి టీడీపీ అధిష్టానం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన నిమ్మక జయరాజుని బీజేపీలో నుంచి తీసుకొచ్చి ఇంచార్జ్ పదవి ఇవ్వాలని చూస్తున్నారు. కానీ ఆయన టీడీపీలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఒకవేళ వచ్చాక సీటు రాదనే డౌట్ ఉంది.
అటు టీడీపీ నేతలు బిడ్డిక పద్మావతి, తమ్మయ్య, భూపతి దొర, కృష్ణబాబు, పల్లవి రాజులు సైతం ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జనార్దన థాట్రాజ్ సతీమణి రమాథాట్రాజ్ సైతం కురుపాం సీటు కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. మరి చూడాలి వీరిలో పుష్పశ్రీ వాణి ప్రత్యర్ధిగా ఎవరిని ఫిక్స్ చేస్తారో..?