Begin typing your search above and press return to search.
‘బాధ్యులు ఎవరు?’.. మోడీ పరివారాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే కొత్త క్యాంపెయిన్
By: Tupaki Desk | 27 May 2021 7:30 AM GMTకొన్నింటితో ప్రాణాల్ని కాపాడొచ్చు. అదే సమయంలో వాటిని ఏ మాత్రం సరిగా వినియోగించకున్నా ప్రాణాలు పోయే పరిస్థితి. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ప్రధాని మోడీ ఎదుర్కొంటున్నారు. కొవిడ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు టీకా కార్యక్రమానికి మించింది లేదు. వ్యాక్సినేషన్ ఎంత భారీగా వేయిస్తే అంత త్వరగా కొవిడ్ ముప్పు నుంచి తప్పించుకునే వీలుంది. కానీ.. ఆర్భాటంగా వ్యాక్సినేషన్ ప్రారంభించి.. ఇప్పటికి నత్తనడకన సాగుతున్న వైనం ఇప్పుడుఆయనకు శాపంగా మారింది.
జనవరిలో మొదలైన వ్యాక్సినేషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. దశల వారీగా వేగవంతం చేసి ఉంటే.. ఈ రోజున ఇన్ని తిప్పలు ఉండేవి కావు. దేశంలో తయారైన వ్యాక్సిన్లను దేశ ప్రజల కోసం కాకుండా ప్రపంచ ప్రజల కోసం వినియోగించటమే కాదు.. అపర సంజీవని ప్రపంచానికి అందించే దేశంగా భారత్ ను..దానికి కర్త.. కర్మ.. క్రియ తానే అన్నట్లుగా ప్రధాని మోడీ ఇచ్చిన బిల్డప్ ఇప్పుడు శాపంగా మారింది.వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జరిపేందుకు అవరమైన టీకాల కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదే పనిగా కేంద్రానికి లేఖలు రాస్తున్న పరిస్థితి.
టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మధ్యలో ఆగింది. ఇలాంటి వేళ.. రంగంలోకి దిగారు కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక వాద్రా. వ్యాక్సిన్ సర్టిఫికేట్ల మీద ఫోటో వేయించుకునే విషయంలో ప్రధాని ప్రదర్శించిన చొరవ.. వ్యాక్సినేషన్ బాధ్యతను మాత్రం రాష్ట్రాల మీదకు వదిలేస్తారా? అంటూ మండిపడుతున్నారు. తాజాగా ఆమె ‘‘ఎవరు బాధ్యులు’’ అంటూ ఒక క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా కేంద్రంపై ప్రశ్నలతో నిప్పులు చెరుగుతున్నారు.
గత ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోడీ ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతూ.. టీకా కార్యక్రమానికి తన వద్ద పూర్తి ప్రణాళిక ఉందని చెప్పిన వైనాన్ని గుర్తు చేస్తూ.. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు. టీకాల తయారీలో భారత్ కు ఉన్న తయారీ కేంద్రాల్ని చూస్తే.. ప్రపంచానికి ఎగుమతి చేసే ఛాన్సు ఉన్నప్పటికి.. సరైన ప్రణాళిక లేకపోవటంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ప్రధాని ఘనంగా ప్రకటించిన ‘టీకా ఉత్సవ్’ ప్రకటన తర్వాతే వ్యాక్సినేషన్ కార్యక్రమం 83 శాతం పడిపోయిందని దుయ్యబట్టారు. 130 కోట్ల మంది భారతీయుల్లో 11 శాతం మందికి ఒక డోసు పూర్తి అయితే.. కేవలం 3 శాతం మందికి మాత్రమే రెండు డోసులు పూర్తి అయ్యాయని ఆమె చెబుతున్నారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయకుండా.. ఇతర దేశాలకు టీకాలు ఎందుకు పంపిస్తున్నారన్న ఆమె ప్రశ్నకు బీజేపీ నేతలు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ‘ఎవరు బాధ్యులు’ అన్న ప్రచారం మోడీ అండ్ కోకు కొత్త తిప్పల్ని తీసుకురావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.