Begin typing your search above and press return to search.
జగన్ మీడియా టీంలో ఆ వెన్నుపోటుదారుడెవరు?
By: Tupaki Desk | 11 April 2020 11:10 AM GMTప్రత్యర్థి - ప్రతిపక్ష నేత చంద్రబాబు దగ్గినా.. తుమ్మినా ముందు ఆయన అనుకూల పచ్చమీడియాకు ఉప్పందుతుంది. వారు చెలరేగిపోతుంటారు. అంతటి మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో అధికార వైసీపీ అధినేత - సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడనే వాదన మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్ సొంత మీడియా టీం తప్పటడుగులు చూశాక.. ఇది ఆయనకు బలంగా ఉండకుండా.. బలహీనతగా మారిందని చెప్పక తప్పడం లేదంటున్నారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహ చతురతలో ఆరితేరిపోయారు. సడన్ నిర్ణయాలతో అందరికీ షాకిస్తున్నారు. నిర్ణయాత్మక కళలో గతంలో కంటే మెరుగ్గా ముందుకెళుతున్నారు. అయితే అతని సొంత మీడియా బృందం మాత్రం జగన్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేక.. ఆయన ఆలోచనలను పసిగట్టలేక బొక్కబోర్లా పడుతున్న తీరు కనిపిస్తోంది. ఇది జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందంటున్నారు.
తాజాగా సీఎం జగన్ బ్రహ్మాస్త్రం సంధించారు. చంద్రబాబు బ్యాక్ ఎండ్ సపోర్టుతో వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చాకచక్యంగా చెక్ పెట్టారు. ఆయన పోస్టును పీకిపడేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ఆగమేఘాలపై త్వరత్వరగా కీలక నిర్ణయాలు తీసుకొని ఆర్డినెన్స్ తెచ్చి.. గవర్నర్ తో ఆమోదం పొందించుకొని ఎన్నికల సంఘం నిబంధనలు సవరించడం ద్వారా నిమ్మగడ్డను పదవి నుంచి సాగనంపింది.
అంతే కాదు, సీఎం జగన్ ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జడ్జియే ఉండాలని కొత్త నిబంధనల్లో పొందుపరిచాడు. ఈ సమయంలో, సీఎం జగన్ మీడియా సెటప్ లోని వ్యక్తులు ఆయన ప్లాన్ ను పాడు చేశాయి. జగన్ ప్రకటించకముందే సీనియర్ ఐఎఎస్ అధికారి రామసుందర్ రెడ్డిని తదుపరి ఎన్నికల ప్రధాన కమిషనర్ గా చేస్తున్నారని జగన్ మీడియా వర్గం లీక్ లు ఇచ్చారు. బిబిసి వంటి ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా సిఎం జగన్ మీడియా సెటప్ లోని మూలాలను నమ్ముతూ ఇదే వాస్తవం అనుకొని రామసుందర్ రెడ్డినే తదుపరి ఎస్ ఇసి అవుతారని రాసుకొచ్చారు. అయితే రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తున్నారనే ప్రచారం జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసింది. అకస్మాత్తుగా మొత్తం చర్చకు కులవాద రాజకీయ రంగు పులుముకుంది.
అయితే జగన్ ఈ తలనొప్పుల నుంచి వెంటనే తప్పించుకున్నారు. రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను తదుపరి ఏపీ ఎన్నికల ప్రధాన కమిషనర్ గా ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.. సీఎం జగన్ మీడియా సెటప్ లోని వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని ఎందుకు వ్యాప్తి చేస్తున్నారని ఇప్పుడు సీఎం జగన్ ఆరాతీస్తున్నట్టు తెలిసింది. వీటన్నిటి వెనుక ఏదైనా రహస్య ఎజెండా ఉందా అని అనుమానిస్తున్నారట.. జగన్ ప్రకటనకు ముందే ఆయనను అభాసుపాలు చేసేలా సొంత మీడియా ఇలా వ్యవహరించడం అధికార వైసీపీకి తలవొంపులు తెస్తోంది.
ఈ ఘటనతో మరోసారి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సెటప్ లో కొన్ని దొంగ బ్లాక్ షీప్స్ ఉన్నాయని స్పష్టమైంది. ఇక జగన్ నిర్ణయాలు పసిగట్టకుండా ఆయనను అభాసుపాలు చేసేలా జగన్ సొంత మీడియా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. కావాలనే జగన్ ను టార్గెట్ చేస్తుండడం తరచూ జరుగుతోంది. మరి ఇప్పటికైనా సీఎం జగన్ తన మీడియా టైంలో ఆ వెన్నుపోటు దారులను గుర్తించి ఏరివేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి మరిన్ని అపవాదులను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటి. భారీ పిఆర్ సంక్షోభంతో పీకల్లోతూ కూరుకుపోయే ప్రమాదం ఉంది. సో జగన్ తస్మాత్ జాగ్రత్త అని మీడియా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.