Begin typing your search above and press return to search.
ఢిల్లీ కాలుష్యం పాపం వారిదేనట..
By: Tupaki Desk | 5 Nov 2019 5:30 PM GMTఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర పరిస్థితికి చేరింది. అక్కడ నిన్న జరిగిన భారత్-బంగాదేశ్ మ్యాచ్ లో ఆటగాళ్లు శ్వాస తీసుకోలేక ముఖాలకు మాస్కులతో కనిపించారు. ఇంతలా ఢిల్లీని కాలుష్య వెంటాడడానికి కారణాలేంటి? ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరడం.. చలికాలంలో ఇది భారీ ప్రమాదాలకు దారితీయడం అందరిని వేధిస్తోంది.
అయితే ఢిల్లీని ఇలా కాలుష్య కారకంగా మారిపోవడానికి ప్రధాన కారణం వాటి పైన ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలేనని అధ్యయనకారులు చెబుతున్నారు.
ఈ రెండు రాష్ట్రాల్లో భారీగా రైతులు పంటలు వేస్తున్నారు. దాదాపు 98శాతం భూమిలో ఈ రెండు రాష్ట్రాల్లో నీటి వసతితో రైతులు సాగు చేస్తున్నారట.. ప్రతి నాలుగు నెలలకోసారి వరి, గోధుమ పంట ముగిశాక వాటి మొదళ్లను కాల్చేస్తున్నారు. ఆ కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తోంది.
ప్రభుత్వం పంట వ్యర్థాలను కాల్చొద్దని ఎంత చెప్పినా కూడా చాలా మంది రైతులు కాలబెడుతూనే ఉన్నారు. వారిని ఆ దిశగా కాల్చకుండా చేస్తేనే ఢిల్లీలో కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి.
ఇక దీపావళి పండుగ ఉత్తరాదిలో పెద్ద పండుగ.. అక్కడ భారీగా టపాసులు కాల్చడం కూడా ఢిల్లీలో శీతాకాలంలో కాలుష్యం పెరిగిపోవడానికి కారణం అవుతోందట.. అలా పక్కరాష్ట్రాల్లో ప్రజల చర్యలే ఢిల్లీకి శాపంగా మారిపోతున్నాని తేలింది.