Begin typing your search above and press return to search.

రఘరామ మెడికల్ రిపోర్టు నార్మల్ ఇచ్చిన డాక్టర్ ఎవరు?

By:  Tupaki Desk   |   21 May 2021 2:30 PM GMT
రఘరామ మెడికల్ రిపోర్టు నార్మల్ ఇచ్చిన డాక్టర్ ఎవరు?
X
నరసాపురం ఎంపీ రఘురామపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేయటం.. పుట్టిన రోజున హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని గుంటూరుకు తీసుకురావటం.. విచారణ చేపట్టటం.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చటం లాంటివి తెలిసిందే. అయితే.. పోలీసుల కస్టడీలో ఆయన్ను చిత్రవధలకు గురి చేశారని.. ఆయన కాళ్లపై ఉన్న గాయాలు ఇందుకు నిదర్శనమన్న మాట పెనను సంచలనంగా మారింది. తర్వాత రఘురామ సుప్రీం తలుపు తట్టటం.. ఆయన్నుసికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించటం.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి తాజాగా సుప్రీంకు నివేదిక ఇవ్వటం తెలిసిందే.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదికి.. రఘురామ తరఫు న్యాయవాదికి మధ్య హాట్ హాట్ వాదనలు జరిగాయి. రఘురామ గాయాలు అధికారుల వల్ల కాదని.. తనకు తానే గాయాపర్చుకున్నట్లుగా ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాదు.. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక అస్పష్టంగా ఉందన్నారు.

దీనిపై రఘురామ తరఫు న్యాయవాది స్పందించారు. తన క్లయింట్ కు బెయిల్ రాకుండా ఉండటం కోసమే ఐపీసీ 124(ఏ) సెక్షన్ కింద కేసు పెట్టటం దీనికి నిదర్శనమన్నారు. కస్టడీలో ఉన్న రఘురామను చిత్రహింసలు పెట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారన్నారు. తన కాళ్లపై ఉన్న గాయాల్ని మెజిస్ట్రేట్ స్వయంగా చూసిన విషయాన్ని గుర్తు చేసిన రఘురామ తరఫు న్యాయవాది రోహత్గి ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు.

రఘురామ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టు అంతా నార్మల్ అని ఇవ్వటాన్ని తప్పు పట్టారు. అలా రిపోర్టు ఇచ్చిన డాక్టర్ భర్త.. వైసీపీ లీగల్ సెల్ నేతగా పేర్కొన్నారు. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లామని.. కింది కోర్టుకు వెళ్లి.. తర్వాత హైకోర్టుకు రావాలని హైకోర్టు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో.. రఘురామ మెడికల్ రిపోర్టు ఇచ్చిన గుంటూరు వైద్యుడి భర్త వైసీపీ లీగల్ సెల్ నేత అన్న కొత్త విషయం కోర్టు ముందుకు రావటతో.. ఈ అంశంపై సుప్రీం ఏ తీరులో స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.