Begin typing your search above and press return to search.

ఆత్మకూరు లీడర్ ఎవరు ?

By:  Tupaki Desk   |   16 Nov 2019 4:34 AM GMT
ఆత్మకూరు లీడర్ ఎవరు ?
X
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ని నియమించేందుకు పార్టీ సిద్దమవుతోంది. ఇప్పటి వరకు ఈ స్థానం ఖాళీ ఉండడం తో పలువురు నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్య కు అధిష్ఠానం బాధ్యతలు అప్పజేప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, బొల్లినేని అందుకు అంగీకరిస్తారా అన్నదే ప్రశ్న. ఇప్పుడు పార్టీ ఇంచార్జిగా నియమితులైతే మళ్లీ ఎన్నికల వరకు భారం మోయాల్సిందే. ఐదేళ్ల పాటు అధికారం లో లేకుండా వ్యయ ప్రయాసల కోర్చి పార్టీ శ్రేణులను ముందుకు నడపడం బొల్లినేని కి కత్తి మీద సామే అవుతుంది. దానికి తోడు త్వరలో జరగ బోయే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ తో ఢీ కొనడం స్థానిక నేతల కు ఆర్థిక సమస్య పెనుభారంగా మారనుంది. ఈ క్రమంలో వారికి అన్ని విధాలా అండగా ఉండి ముందుకు నడపాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్‌చార్జిపైనే ఉంటుంది. ఈ క్రమం లో బొల్లినేని కృష్ణయ్య బాధ్యతలు చేపడితే కొంతమేర పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు పేరు కూడా ఈ పదవికి వినిపిస్తోంది. అయితే వయసు రీత్యా నియోజ కవర్గ బాధ్యతలు చేపట్టి ఐదేళ్ల పాటు వ్యయ ప్రయాసల కోర్చి పార్టీ శ్రేణులను ముందుకు నడిపేందుకు ఏమాత్రం అంగీకరిస్తారనేది ప్రశ్నార్థకమే.

జడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కి సైతం పార్టీ అధిష్ఠానం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేక పోలేదు. అయితే నియోజకవర్గ రథసారధిగా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా... అనే అంశంపై చర్చనీయాంశంగా మారింది నియోజకవర్గం లో బొమ్మిరెడ్డి కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గ్రామ గ్రామాన పార్టీలకతీతం గా పరిచయాలు ఉన్నాయి.

మరో వైపు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూటూరు మురళీ కన్నబాబు పేరూ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన వెంకట గిరి నియోజక వర్గ పరిశీలకులుగా ఉన్నారు. 2012లో ఆత్మకూరులో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న పార్టీని ఆయన ముందుండి నడిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి పార్టీని పటిష్టపరిచారు. వీరిలో బొల్లినేని కి, కన్నబాబు కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.