Begin typing your search above and press return to search.
మోడీ.. జిన్ పింగ్ పక్కనున్న సూట్ వ్యక్తి ఎవరు?
By: Tupaki Desk | 13 Oct 2019 7:22 AM GMTచైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటనలో భాగంగా మహాబలిపురానికి రావటం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి.. జిన్ పింగ్ కు వెనుక ఒక సూట్ వ్యక్తి చాలామంది కంట్లో పడ్డారు. ఎవరాయన? అన్న ప్రశ్న పలువురిలో వచ్చింది. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. 2007 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ ఎస్ అధికారి మధుసూదన్ రవీంద్రన్.
మోడీ మాటల్ని జిన్ పింగ్ కు అర్థమయ్యేలా అనువాదం చేసిన ఆయనది స్వస్థలం చెన్నై కావటం గమనార్హం. తొలి పోస్టింగ్ లోనే బీజింగ్ లోని ఇండియన్ మిషన్ లో పని చేసే అవకాశం లభించింది. చైనాకు వెళ్లినంతనే అత్యంత క్లిష్టమైన మాండరిన్ భాషలో పట్టును సంపాదించటమే కాదు.. చైనా భాషలోనూ పట్టు సాధించారు. చివరకు ప్రధాని అనువాదకుడిగా పని చేసే అవకాశాన్ని దక్కించుకొన్నారు.
తన మాతృ భాష అయితే తమిళంతో పాటు.. ఇంగ్లిషు.. మలయాళంలోనూ ప్రావీణ్యం ఉంది. తాజాగా ఇద్దరు దేశాధినేతలకు అనువాదకుడిగా వ్యవహరించి ఒక్కసారిగా దేశ ప్రజలకు సుపరిచితుడిగా మారారు. చెన్నైలోని అన్నా వర్సిటీ లో ఇంజినీరింగ్ పట్టా సాధించిన అనంతరం సివిల్స్ సాధించారు.