Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?
By: Tupaki Desk | 18 July 2021 8:08 AM GMTహుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. బీజేపీకి ఈటల రాజేందర్ ఎప్పుడో ఖాయమయ్యాడు. ఇక కాంగ్రెస్ కు మొదట కౌశిక్ రెడ్డి అనుకొని ఆయన హ్యాండ్ ఇవ్వడంతో పొన్నం ప్రభాకర్ తెరపైకి వచ్చాడు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది.
అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా సరే తమను ఎదురించిన ఈటల రాజేందర్ ఓడించాలని పంతం పట్టింది. అక్కడ ఇప్పటికే మంత్రులను మోహరించి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ కు హ్యాండించ్చి టీఆర్ఎస్ లోకి రాబోతున్న కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ టికెట్ ఇస్తారా? లేక ఇటీవలే పార్టీలో చేరిన టీటీడీపీ మాజీ అధ్యక్షులు, బీసీ నేత ఎల్.రమణను చేర్చుకుంటారా? అన్నది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈనెల 21న భారీ ర్యాలీగా హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డి పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే శుక్రవారం ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ స్వయంగా కండువా కప్పి ఆహ్వానించారు. మరి 21న కౌశిక్ రెడ్డికి అలాంటి స్వాగతం దక్కుతుందా? కౌశిక్ రెడ్డి చేరగానే టికెట్ ఖాయం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.
కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తుందా? ఇవ్వదా? అనేది పెద్ద డౌట్ గా మారింది. చేర్చుకోవడం వరకూ ఓకే కానీ టికెట్ సంగతియే అనుమానంగా మారింది. ఒకవేళ టీఆర్ఎస్ గనుక కౌశిక్ ను పోటీ చేయిస్తే ఆయన మాట్లాడిన ఆడియోను కాంగ్రెస్ అస్త్రంగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇదే సమయమంలో బీజేపీ కూడా కేసీయార్ ను టార్గెట్ చేయటం ఖాయం. కాంగ్రెస్+బీజేపీ టార్గెట్ ను తప్పించుకోవాలంటే కౌశిక్ ప్లేసులో కొత్త అభ్యర్ధిని పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామంతో గులాబీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు సమాచారం.
ఇక ఉప ఎన్నిక కోసం కేసీఆర్ చేయించిన సర్వేలోనూ.. ఇంటెలిజెన్స్, వ్యక్తిగత సర్వేల్లో సైతం ఈటలకు బలమైన పోటీదారు కౌశిక్ రెడ్డినేనని తేలిందని సమాచారం. ఈ మేరకు కేసీఆర్ కూడా ఈ డ్యామేజ్ తర్వాత దీనిపై పునరాలోచపడిపోయాడట.. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే పీటముడి తెగడం లేదట.. ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.
టీఆర్ఎస్ టికెట్ ఖాయమైపోయిన తర్వాత కౌశిక్ రెడ్డి నోరుజారి అనవసరంగా చిక్కుల్లో పడిపోయాడనే చర్చ సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి వ్యవహారం చివరకు ఎటూ కాకుండా పోతుందేమో అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. టీఆర్ఎస్ తో డీల్ మేరకు ఉపఎన్నికలో నామినేషన్ వేసేముందు వరకు చాలా గుంభనంగా ఉంచాల్సిన సీక్రెట్ ను కౌశిక్ తన అత్యుత్సాహంతో రివీల్ చేసేశారు. దాంతో టీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టేయటంతో పాటు అందరి ముందు పలుచనైపోయారు.ఇప్పుడు టీఆర్ఎస్ కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తుందా? లేదా? అన్నది సందేహంగా మారింది.
-బీసీ కోటాలో ఎల్.రమణ.. కానీ హుజూరాబాద్ లో కష్టమే
బీసీ కోటాలో పద్మాశాలీ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తూ ఎల్ రమణను కేసీఆర్ చేర్చుకున్నా నాన్ లోకల్ జగిత్యాలకు చెందిన రమణను హుజూరాబాద్ లో నిలబెడితే గెలుస్తాడా? లేదా? అన్నది టీఆర్ఎస్ ను కలవరపెడుతోంది. స్థానికేతరుడు కావడం ఎల్ రమణకు మైనస్ గా మారింది.
ఇక కౌశిక్ రెడ్డి, ఎల్ రమణ కాకుండా టీఆర్ఎస్ నుంచి బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేరు కూడా వినపడుతోంది. బీసీ నాయకుడిగా గతంలో ఈటలకు గట్టి పోటీనిచ్చిన ఈయన టికెట్ ఆశిస్తున్నాడు. ఇక వీరే కాదు.. టీఆర్ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీజేపీ నే ఇనుగాల పెద్దిరెడ్డి సైతం టీఆర్ఎస్ టికెట్ ఇస్తే పోటీచేయాలని భావిస్తున్నాడు. మాజీ మంత్రి ముద్దసాని దామోదరెడ్డి కుటుంబం కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తోంది. కేసీఆర్ నిర్ణయమే ఇందులో ఫైనల్ అని అంటున్నారు.