Begin typing your search above and press return to search.
హుజూరా‘బాద్ షా’ ఎవరు? మొదటి రౌండ్ ఫలితం వచ్చేదెప్పుడు?
By: Tupaki Desk | 2 Nov 2021 4:11 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంటకు అంతకు మించిన చర్చకు తావిచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడే రోజు వచ్చేసింది. దీపావళి పండక్కి రెండు రోజులు ముందు వచ్చే ఈ ఫలితం ఎవరికి వెలుగులు నింపుతుంది? మరెవరికి చీకట్లను కమ్మేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఓట్ల లెక్కింపును ఈ రోజు (మంగళవారం) ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్క వేస్తారు. ఈవీఎం కావటంతో ఫలితం త్వరగానే వెలువడనుంది.
ఉదయం 9 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో పాటు మొదటి రౌండ్ ఫలితం వెలువడనుంది. ఉదయం పదకొండు గంటలకు విజేత ఎవరన్న దానిపై క్లారిటీ రావటం ఖాయమని.. పన్నెండు గంటలకు పూర్తి అవగాహన వస్తుందని చెబుతున్నారు. తుది ఫలితం తేలాలంటే మాత్రం సాయంత్రం 4 గంటలకు వెలువడే వీలుంది. ఇక.. విజేత ఎవరన్న విషయానికి వస్తే.. ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఈటల రాజేందర్ వైపే చూపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరెప్పుడూ జరగనంత భారీగా సాగిన ఎన్నికల పోరులో.. డబ్బుల వరదగా సాగింది. ఓటుకు రూ.6వేలు అధికార టీఆర్ఎస్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగటం.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటుకు రూ.1500 ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలా.. ఎవరికి వారు వారి శక్తి మేరకు డబ్బుల్ని ఖర్చుచేసిన ఈ ఉప ఎన్నిక పుణ్యమా అని మొత్తం ఖర్చు రూ.500 కోట్లను టచ్ చేసినట్లుగా చెబుతున్నారు.
మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందన్న విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం ఈటల గెలుపు గ్యారెంటీ అన్నది స్పష్టంగా చెబుతున్నారు. మజార్టీ ఎంతన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారీగా సాగిన పోలింగ్ నేపథ్యంలో.. మెజార్టీ కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తుంటే. పోటాపోటీ కావటంతో మెజార్టీ పెద్దగా ఉండదన్న మాటా వినిపిస్తోంది. ఇక.. రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి నిలిస్తే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ లభిస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఇక.. విజయం సాధించిన అభ్యర్థి ఎవరైనా సరే.. విజయోత్సవ సంబరాల మీద నిషేధం ఉన్నట్లుగా ఎన్నికల కమిషనర్ స్పష్టం చేస్తున్నారు.
ఈ రోజు ఉదయం 8 గంటల వేళలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఏజెంట్ల సమక్షంలో 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లనులెక్కిస్తారు. అనంతరం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది. ఒక్కో రౌండ్ లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. రెండు హాళ్లలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ ఫలితాల వెల్లడికి 30 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కొవిడ్ రెండుడోసుల్ని తీసుకున్న వారే కౌంటిగ్ సిబ్బందిగా ఎంపిక చేశారు. వీరికి ర్యాపిడ్ టెస్టు నిర్వహించి మరీ పాసులు జారీ చేశారు. విదిగా మాస్కులు ధరించి కౌంటింగ్ కేంద్రానికి హాజరు కావాలని చెబుతున్నారు.