Begin typing your search above and press return to search.
హరీశ్ ను మించే మెజార్టీ సాధించిన ఈ యువనేత ఎవరంటే....
By: Tupaki Desk | 24 Oct 2019 4:50 PM GMTఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు.డబుల్ హ్యాట్రిక్ కంటే ఓ దఫా ఎక్కువే గెలుపు ఓ రికార్డు అనుకుంటే...అంతకంటే రికార్డు భారీ మెజార్టీని సొంతం చేసుకోవడం. అలా ఎన్నో ప్రత్యేకతలను తన ఖాతాలో జమ చేసుకుంది...సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అజిత్ బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు మెజార్టీ కంటే అధికం కావడం గమనార్హం.
పవార్ కుటుంబంలో కీలక వ్యక్తి అయిన అజిత్ పవార్ 1991 నుంచి బారామతి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. మరోవైపు తెలంగాణ టీఆర్‌ఎస్ పార్టీకి సిద్దిపేట కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే. అజిత్ తాజా గెలుపు నాటికి దేశంలో అత్యధిక మెజార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఖాతాలో ఉంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఎవరూ సాధించని విధంగా 1,20,650 ఓట్లతో హరీశ్ భారీ విజయం సొంతం చేసుకున్నారు. హరీశ్ తాజా ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించగా, ప్రతి ఎన్నికకూ మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. అదే రీతిలో అజిత్ పవార్ సైతం ప్రతి ఎన్నికలోనూ గెలుపొందడమే కాకుండా....ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 1,65,265 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు.
కాగా, గత సెప్టెంబర్‌లో అజిత్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కలకలం సృష్టించింది. తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శరద్ పవార్ పేరును చేర్చడంతో అజిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శరద్ పవార్‌కు ఫోన్ చేశారు. దాదాపు 15 నిమిషాలు పైగా మాట్లాడిన సోనియా ఆయనకు మద్దతు, సానుభూతి తెలిపారు. అజిత్ పవార్ రాజీనామా గురించి కూడా సోనియా ఆరా తీశారు. అంతటి పట్టును అజిత్ పవార్ కలిగి ఉన్నారు.