Begin typing your search above and press return to search.
నో డౌట్ ..కరోనా వారివల్లే వ్యాప్తి చెందుతుంది : WHO కీలక ప్రకటన !
By: Tupaki Desk | 18 Aug 2020 5:30 PM GMTకరోనా వైరస్ ..కరోనా వైరస్ .. గత కొన్ని నెలలుగా ప్రజలు ఈ పేరు విని విని మానసికంగా కూడా చాలా కృంగిపోయారు. ఎక్కడికి పొతే ఏమౌతుందో అంటూ ఇంట్లోనే ఉన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచంలో చాలా దేశాలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కానీ , ఇంకా వ్యాక్సిన్ పై ఎటూ తేల్చలేకపోతున్నారు. రోజు రోజుకీ పెరుగుతున్నాయి. వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా తెలియకుండానే కరోనా మహమ్మారి వ్యాప్తి అయితే జరుగుతుంది.
ఈ తరుణంలో కరోనా వ్యాప్తి చేస్తున్న క్యారియర్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాప్తికి కారణం ఎవరు .. కరోనాను ఎవరు ఎవరు ఎక్కువగా వ్యాప్తి చెందిస్తున్నారు అన్న అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. చిన్న పిల్లల ద్వారా కానీ , వృద్ధుల ద్వారా కానీ కరోనా వ్యాప్తి చెందడం లేదని తేల్చేసింది. 20 సంవత్సరాల వయసున్న యువత నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్న మధ్యవయసు వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతోందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెస్ట్రన్ ఫెసిఫిక్ రీజినల్ డైరెక్టర్ స్పష్టం చేశారు. కొంతమందిలో కరోనా సోకినట్లుగా లక్షణాలు కూడా కనిపించడం లేదని, ఇక వీరంతా వేరే వ్యక్తులకు కరోనా వ్యాప్తి చెందడానికి కారణం.
ఇక బయట తిరుగుతున్న ప్రజలలో ఆరోగ్యవంతులు ఎవరు , కరోనా బారిన పడిన వారు ఎవరు అన్నది తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా వ్యాప్తి జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ జరగాలంటే ముఖ్యంగా యువత, మధ్య వయస్కులు అప్రమత్తంగా ఉండాలని అలాగే కరోనా మహమ్మారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. కరోనా కారణంగా కొంతకాలం పాటు లాక్ డౌన్ కొనసాగినా, ప్రస్తుతం అందరూ దైనందిన జీవనంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చాలామంది కరోనా బారిన పడుతున్నారని వివరించారు.