Begin typing your search above and press return to search.
లాక్‌డౌన్ పొడగింపు పై డబ్య్లూహెచ్ఓ కీలక సూచనలు
By: Tupaki Desk | 13 April 2020 6:15 AM GMTకరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగించేలా పరిణామాలు ఉన్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌పై ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు పరిశీలించాయి. భారతదేశం ముందే స్పందించి నివారణ చర్యలు పక్కాగా తీసుకుంటోందని ప్రశంసించాయి కూడా. ప్రస్తుతం రెండో విడతగా లాక్‌డౌన్ కొనసాగించే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) స్పందించింది. ఈ సందర్భం గా లాక్‌డౌన్ పై భారతదేశానికి పలు కీలక సూచనలు చేసింది. రెండో విడత లాక్‌డౌన్‌లో వైరస్ వ్యాప్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదని, ప్రజల జీవనోపాధి దెబ్బ తినకుండా భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
డబ్య్లూహెచ్ఓ స్పెషల్ ఎన్వాయ్ డైరక్టర్ డేవిడ్ నబారో మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ విషయంలో భారత నిర్ణయాలు, దేశ పురోగతి వంటి విషయాలను గమనిస్తున్నామని తెలిపారు. భారత ప్రజలు తీసుకున్న చర్యకు తాము చాలా మద్దతుగా ఉన్నట్లు ప్రకటించారు. తమకు వివరాలు ఏమీ అందకున్నా లాక్‌డౌన్ ద్వారా మాత్రం కరోనా వ్యాప్తిని భారత్ నివారించగలిగిందని వెల్లడించారు. సంక్షోభంతో బాగా ప్రభావితమైన వారి జీవనోపాధిని కల్పించడానికి, ఆహార సంక్షోభాన్ని నివారించడంలో, పౌర సమాజం, ప్రజా సంఘాలు, స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని చూసి తాము సంతోషిస్తున్నట్లు తెలిపారు.
అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగింపుపై భారత్ ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా త్రిబుల్ ఎల్ సూత్రం వివరించారు. లాక్‌డౌన్ 2.0 మరింత దృష్టి పెట్టాలని, టా డ్రైవన్ అవసరం ఉందని గుర్తు చేశారు. జీవితం (లైఫ్), జీవనోపాధి (లైవ్లీహుడ్), జీవనం (లైవింగ్) మూడు ఎల్‌లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. చాతుర్యం తో, సరైన తీరులో ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకొస్తే ఆశించిన ఫలితం సాధ్యమని తెలిపారు. ఈ విధంగా భారతదేశానికి కరోనా కట్టడి విషయమై ఇలా సూచనలు చేశారు.