Begin typing your search above and press return to search.

బెన‌జీర్‌ను హ‌త్య చేసిందెవ‌రో చెప్పిన బుక్‌!

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:48 AM GMT
బెన‌జీర్‌ను హ‌త్య చేసిందెవ‌రో చెప్పిన బుక్‌!
X
పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని బెన‌జీర్ భుట్టోను దారుణంగా హ‌తమార్చింది ఎవ‌ర‌న్న విష‌యాన్ని ఓ పుస్త‌కం తాజాగా వెల్ల‌డించింది. బెన‌జీర్ హ‌త్య వెనుక ప్ర‌ముఖ ఉగ్ర‌వాది లాడెన్ తో పాటు.. పాక్ మాజీ అధ్య‌క్షుడు ముష్రార‌ఫ్ ఉన్న‌ట్లుగా ఆరోప‌న‌లున్నాయి. ఇదిలా ఉంటే.. బెన‌జీర్ ను చంపేసింది తామేన‌ని ప్ర‌క‌టించింది పాక్ లోని తెహ్రిక్ తాలిబ‌న్ ఉగ్ర‌వాద సంస్థ‌.

ఇంక్విలాబ్ మెహ్ సూద్ సౌత్ వ‌జీరిస్థాన్ పేరుతో ఒక పుస్త‌కం తాజాగా విడుద‌లైంది. ఇందులో భుట్టో హ‌త్య‌కు సంబంధించిన విష‌యాలు వెల్ల‌డించారు.ఈ పుస్త‌కం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 588 పేజీలున్న ఈ పుస్త‌కంలో ప‌లువురు తాలిబ‌న్ నేత‌ల గురించి.. వారు చేసిన ఘోరాల ఘ‌న‌కార్యాల గురించి చెప్పుకొచ్చారు. తాలిబాన్ నేత అబూ మ‌న్సూర్ అసిమ్ ముఫ్తీ రాసిన ఈ పుస్త‌కంలోబెన‌జీర్ భుట్టోను హ‌త‌మార్చింది ఎవ‌రో వెల్ల‌డించారు.

బిలాల్ అలియాస్ స‌యిద్‌.. ఇక్రాముల్లా అనే ఇద్ద‌రు ఆత్మాహుతి స‌భ్యుల బృందం బెన‌జీర్‌ను చంపేశార‌న్నారు. భుట్టోపై ముందు కాల్పులు జ‌రిపింది బిలాలేన‌ని.. బుల్లెట్ ఆమె మెడ‌కు త‌గిలిన వెంట‌నే త‌న‌ను తాను పేల్చేసుకున్న‌ట్లుగా వెల్ల‌డించారు. బాంబు పేలుడు సంభ‌వించిన త‌ర్వాత ఇక్రాముల్లా త‌ప్పించుకున్నాడు. ఇదిలా ఉంటే.. బెన‌జీర్ భుట్టో మ‌ర‌ణం వెనుక లాడెన్ ఉన్న‌ట్లుగా గ‌తంలో పాక్ నిఘా వ‌ర్గాలు వెల్ల‌డించింది. భుట్టోను మ‌ట్టుబెట్టేందుకు ఉప‌యోగించిన పేలుడు ప‌దార్థాలు లాడెన్ పేరుతో కొరియ‌ర్ వ‌చ్చింద‌ని పాక్ నిఘా వ‌ర్గాలు అప్ప‌ట్లో చెప్పింది. ఇదిలా ఉంటే.. భుట్టోను చంపేందుకు జ‌మైత్ ఉలెమా-ఇ-ఇస్లాం ఫ‌జ‌ల్ చీఫ్ ఫ‌జ్ల‌ర్ రెహ‌మాన్ ను లాడెన్ ఆదేశాలు జారీ చేశాడ‌ట‌.

ఇదిలా ఉంటే.. భుట్టో ప్రాణాలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లుగా నిఘా వ‌ర్గాలు వెల్ల‌డించినా.. ఆమెకు త‌గినంత భ‌ద్ర‌త క‌ల్పించే విష‌యంలో నాటి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. అనుకున్న‌ట్లుగానే భుట్టోను హ‌త్య చేశారు. ఆమె మ‌ర‌ణానికి కార‌ణం లాడెన్ గా చెబుతారు. అయితే.. హ‌త్య‌ను లాడెన్ ప‌ర్య‌వేక్షించిన‌ట్లుగా చెబుతారు. ఇదే విష‌యాన్ని మ‌రింత వివ‌రంగా తాజా పుస్త‌కం వెల్ల‌డించింది.