Begin typing your search above and press return to search.

చంద్రబాబు తర్వాత టీ.టీడీపీ ఎవరిదంటే?

By:  Tupaki Desk   |   12 July 2021 2:30 PM GMT
చంద్రబాబు తర్వాత టీ.టీడీపీ ఎవరిదంటే?
X
తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యింది. ఎల్.రమణ నిష్క్రమించిన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం నాయకత్వ మార్పునకు సిద్ధమవుతోంది. టీ-టీడీపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

టీ-టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా సంభాషించినట్టు తెలిసింది. తెలంగాణలో ఉంటున్న తన బావమరిది బాలకృష్ణ లేదా కోడలు బ్రాహ్మణిని తెలంగాణలో పార్టీని నడిపించడానికి బాధ్యతలు అప్పగించాలా? ఆసక్తి చూపుతారా? అని అడిగినట్టు తెలిసింది.

అయితే నేతల నుంచి చంద్రబాబుకు సానుకూల స్పందన రానట్టు తెలిసింది. 'బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే. అతన్ని తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా నియమించడం భారీ విమర్శలకు దారితీస్తోంది. షర్మిల ఇప్పటికే తెలంగాణలో తేలిపోతుంది. ఆంధ్రా ముద్రపడింది.. అందుకే బాలక్రిష్ణను తెలంగాణ టీడీపీలోకి తీసుకురావడం సరైనది కాదు' అని టీడీపీ నేతలు చంద్రబాబుకు క్లారిటీగా చెప్పినట్టు తెలిసింది.

బ్రాహ్మణి గురించి మాట్లాడిన చంద్రబాబు, భవిష్యత్తులో తాను రాజకీయాల్లో ఉండనని డిసైడ్ అయ్యారు. కాబట్టి బాలక్రిష్ణ లేదా బ్రాహ్మణి తెలంగాణ టీడీపీకి నాయకత్వం వహిస్తారని చంద్రబాబు ధృవీకరించారు. 'వారు తెలంగాణలో పార్టీకి సేవ చేయాలనుకుంటే అది వారి ఇష్టం. కానీ వారు నాయకత్వాన్ని మాత్రం చేపట్టరు' అని చంద్రబాబు ముగించారు.

పార్టీ కేడర్ లో చైతన్యం నింపడానికి.. కోల్పోయిన కీర్తిని టీడీపీకి తిరిగి తీసుకురావడానికి తెలంగాణలో పర్యటనలు నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.