Begin typing your search above and press return to search.

డబ్ల్యూహెచ్​వో చెప్పినా డోంట్​కేర్​..! అస్ట్రాజెనికాపై నిషేధం..!

By:  Tupaki Desk   |   15 March 2021 3:58 AM GMT
డబ్ల్యూహెచ్​వో చెప్పినా డోంట్​కేర్​..! అస్ట్రాజెనికాపై నిషేధం..!
X
ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ తయారుచేసిన ఆస్ట్రాజెనికా టీకాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ టీకా తీసుకొని పలుదేశాల్లో ప్రజలకు రక్తం గడ్డకడుతున్నది. దీంతో ఆయా దేశాల్లో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఆస్ట్రాజెనికా టీకాను నిషేధించాయి. ఈ టీకాతో ఎటువంటి సైడ్​ ఎఫెక్ట్స్​లేవని.. డబ్ల్యూహెచ్​వో ప్రకటించినప్పటికీ కొన్ని దేశాల్లో భయాందోళనలు పోలేదు. తాజాగా ఐర్లాండ్​ ఆస్ట్రాజెనికా టీకాపై నిషేధం విధించింది. ఇప్పటికే డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, ఎస్టోనియా, లిథువేనియా, థాయిలాండ్, ఐస్‌లాండ్ దేశాలు ఆస్ట్రాజెనెకా టీకాను నిషేధించాయి. ఆయా దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారికి రక్తం గడ్డకడుతున్నది. దీంతో పలు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నది.

ప్రస్తుతం మనదేశంలో సీరం ఇన్​స్టిట్యూట్​ తయారుచేసిన కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ కూడా ఆక్స్​ఫర్డ్​ సహకారంతోనే రూపొందించారు. అయితే మనదేశంలో రక్తం గడ్డకడుతున్న కేసులు నమోదు కాలేదు. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ముగ్గురు ఐర్లాండ్ ఆరోగ్య కార్యకర్తల్లో తీవ్రమైన రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం వంటివి కనిపించాయని ఆ దేశ వైద్య అధికారులు తెలిపారు. టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు కనిపిస్తుండడంతో ఐర్లాండ్ నేషనల్ ఇమ్యునైజేషన్ అడ్వైజరీ కమిటీ (ఎన్ఐఏసీ) వ్యాక్సినైజేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించింది. డబ్ల్యూహెచ్​వో మాత్రం ఈ టీకాతో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని చెబుతున్నది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రపంచదేశాలు ఆస్ట్రాజెనికాను నిషేధించడంతో మనదేశంలో పంపిణీ చేస్తున్న కోవిషీల్డ్​పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోవిషీల్డ్​ పంపిణీపై సమగ్రంగా పరిశీలన జరుపుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆస్ట్రాజెనికా, కోవిషీల్డ్​ రెండు ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ సహకారంతోనే తయారయ్యాయి. అయితే మనదేశంలో భారత్​ బయోటెక్​ రూపొందించిన కోవాక్జిన్​ .. సీరం ఇన్​స్టిట్యూట్​ వారి కోవిషీల్డ్​ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటకే తొలిదశ వ్యాక్సినేషన్​ కూడా పూర్తయింది.