Begin typing your search above and press return to search.

కరోనా మూలాలు ఎక్కడ? డబ్ల్యూహెచ్​వో ఏం తేల్చింది?

By:  Tupaki Desk   |   20 March 2021 10:30 AM GMT
కరోనా మూలాలు ఎక్కడ? డబ్ల్యూహెచ్​వో ఏం తేల్చింది?
X
కరోనా ఎక్కడ పుట్టింది. ఇదో మిలియన్​ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. కరోనా చైనా లో పుట్టిందన్న విషయం ప్రపంచం మొత్తం నమ్మింది. అయితే చైనా కావాలనే ఈ వైరస్​ను పుట్టించిందని.. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిందని ఆరోపణలు వచ్చాయి. అమెరికా సహా అగ్రదేశాలన్నీ ఇదే ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే చైనాలోని వూహాన్​ వైరాలజీ ల్యాబ్​లోనే కరోనా పుట్టిందని కొందరు.. అక్కడి మాంస విక్రయశాలలో పుట్టిందని మరికొందరూ వాదిస్తూ వచ్చారు. కరోనా ఎక్కడ పుట్టిందో తేల్చాలంటూ డబ్ల్యూహెచ్ వో మీద కూడా ఆరోపణలు వచ్చాయి. సదరు సంస్థ మీద ఒత్తిడి పెరిగింది. దీంతో డబ్ల్యూహెచ్​ వో ప్రతినిధి బృందం చైనాకు బయలుదేరింది. అక్కడి వూహాన్​ సిటీలో పర్యటించింది.

అయితే కరోనా వైరస్​ చైనా లోని వైరాలజీ ల్యాబ్​ లో పుట్టలేదని అక్కడి.. వన్యప్రాణుల పెంపకం కేంద్రాల నుంచి పుట్టి ఉంటుందని డబ్ల్యూహెచ్​కు చెందిన సభ్యుడు సభ్యుడు పీటర్​ డస్​ బాక్​ అంటున్నారు. వూహాన్‌లోని ల్యాబ్‌ లో ఈ వైరస్​ పుట్టే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్​ ఎక్కడ పుట్టిందో తెలుసుకొనేందుకు ఇటీవల డబ్ల్యూహెచ్​వో బృందం వూహాన్​ లో పర్యటించింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను తేల్చింది.

దక్షిణ చైనాలో వన్యప్రాణుల్ని పెంపకం కేంద్రాల నుంచి వూహాన్‌లోని సీఫుడ్‌ మార్కెట్‌కి తరలిస్తూ ఉంటారని, దీనికి సంబంధించి తమ పర్యటనలో ఆధారాలు లభించాయని పీటర్‌ తెలిపారు.అమెరికన్​ న్యూస్​ ఏజెన్సీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పీటర్​ పలు కీలక విషయాలను తేల్చారు. అయితే వూహాన్​లోని మాంస విక్రయశాలలో కరోనా వైరస్​ తొలిసారిగా పుట్టింది. అయితే వన్య ప్రాణుల పెంపకం కేంద్రాల నుంచి పంపిన జంతువుల ద్వారా కరోనా వైరస్‌ మనుషుల్లోకి వచ్చి ఉంటుందనే పీటర్​ అంచనా వేశారు.

చైనా ప్రభుత్వం వన్య ప్రాణుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. పాంగోలిన్స్, పార్క్‌పైన్స్, పునుగు పిల్లులు, రాకూన్‌ శునకాలు, బాంబూ ఎలుకలు వంటి జంతువులను అక్కడి ప్రజలు పెంచుతుంటారు. ఈ జంతువుల నుంచే వైరస్​ వచ్చి ఉంటుందని డబ్ల్యూహెచ్​ ఓ అభిప్రాయ పడింది. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు డబ్ల్యూహెచ్​ వో అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పడే అవకాశం ఉంది.