Begin typing your search above and press return to search.

డేంజర్: కరోనా వేళ పుట్టుకొచ్చిన మరో వ్యాధి

By:  Tupaki Desk   |   17 May 2020 9:32 AM GMT
డేంజర్: కరోనా వేళ పుట్టుకొచ్చిన మరో వ్యాధి
X
యూరప్ - అమెరికాలో చిన్న పిల్లలకు మరో అరుదైన భయంకర వ్యాధి సోకుతోంది. దీని కారణంగా ఇప్పటికే ఆయా దేశాల్లో పిల్లలు పిట్టల్లా రాలుతున్నారు. దీనిపై తాజాగా డబ్ల్యూహెచ్.వో సంచలన ప్రకటన చేసింది. ఈ అరుదైన వ్యాధికి కరోనాతో సంబంధం ఉందని డబ్ల్యూహెచ్.వో డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.

యూరప్ - అమెరికా దేశాల్లో 14 ఏళ్లలోపు చిన్న పిల్లలకు ‘పీడియాట్రిక్ ఇన్ ఫ్లేమేటరీ మల్టీసిస్టమ్ సిండ్రోమ్ ’ అనే అరుదైన వ్యాధి విజృంభిస్తోంది. దీని కారణంగా న్యూయార్క్ లో ముగ్గురు - యూరప్ లో ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కవాసాకి అనే అరుదైన వ్యాధి మాదిరిగానే.. ఈ వ్యాధి పిల్లలకు సోకుతోంది. చిన్న పిల్లల్లో దీని వల్ల నిరంతరంగా జ్వరం - కడుపునొప్పి - ఒంటి మీద దద్దుర్లు - నాలుకవాపు లక్షణాలు కనిపిస్తాయి.

దీనిపై తాజాగా డబ్ల్యూ.హెచ్.వో కీలక ప్రకటన చేసింది. పిల్లల్లో వచ్చే ఈ వ్యాధి ప్రాథమిక నివేదికల ఆధారంగా కరోనాతో సంబంధం ఉందని బాంబు పేల్చింది.

ఇప్పటికే కరోనాతో ప్రపంచదేశాలన్నీ అల్లకల్లోలం అవుతున్న వేళ.. పిల్లల్లో వస్తున్న ఈ అరుదైన వ్యాధితో అందరిలోనూ ఆందోళన మరింత పెరుగుతోంది.