Begin typing your search above and press return to search.
ప్యాకింగ్ మాంసం మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది
By: Tupaki Desk | 24 Oct 2015 10:30 PM GMT‘‘ఈ నగరానికి ఏమైంది’’ అంటూ ప్రతి సినిమా వచ్చే అడ్వర్టైజ్ మెంట్ తో పాటు.. ‘‘పొగతాగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు’’ అంటూ ప్రకటనలు వస్తుంటాయి. ఇక.. సిగిరెట్ ప్యాకెట్ మీద కూడా పొగతాగటం ఆరోగ్యానికి హానికరమన్న హెచ్చరికతో పాటు.. సిగిరెట్ ఆరోగ్యానికి చేసే నష్టం గురించిన చిత్రాలు కూడా అచ్చేసి అమ్ముతుంటారు.
రానున్న రోజుల్లో ప్యాకైజ్డ్ మాంసం మీద కూడా ఇలాంటి హెచ్చరిక లేబుళ్లు ప్రింట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ప్యాకింగ్ మాంసం తినటం ఆరోగ్యానికి చాలా ఎక్కువ అపాయమని తేల్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా ప్యాకింగ్ మాంసం వల్ల కలిగే నష్టం గురించి వివరంగా హెచ్చరిస్తోంది.
ఈ ప్యాకింగ్ మాంసంలో పోర్క్ (పంది మాంసం). దాంతో చేసిన స్నాక్స్ తో పాటు.. ఇతర ప్యాకింగ్ చేసిన మాంసం లో క్యాన్సర్ కారకాలు చాలా హెచ్చు మోతాదులో ఉంటాయని తేల్చారు. మామూలు మాంసంతో పోలిస్తే.. రెడ్ మీట్ లో తక్కువ హాని చేస్తుందని చెబుతున్నారు. అందుకే.. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మాంసం ప్యాకెట్ల మీద ‘‘హానికరం’’ స్టిక్కర్లు వేయాలన్న సూచనను సైంటిస్టులు చేస్తున్నారు. ప్రాశ్చాత్య దేశాల్లో అమ్మే మాంసం ప్యాకెట్లలో ఇలాంటివి ఉన్నాయని తేల్చారు. ఇండియాలో అమ్మే మాంసం ప్యాకెట్ల నాణ్యతకు సంబంధించిన విషయాల్ని మాత్రం వెల్లడించలేదు. ప్యాకెట్లలో లభించే మాంసం విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సుమా.