Begin typing your search above and press return to search.

స్వైన్ ఫ్లూ కంటే క‌రోనా అత్యంత ప్ర‌మాద‌క‌రం

By:  Tupaki Desk   |   15 April 2020 3:30 AM GMT
స్వైన్ ఫ్లూ కంటే క‌రోనా అత్యంత ప్ర‌మాద‌క‌రం
X
ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తుండ‌గా.. దీని మాదిరి గ‌తంలో అనేక వ్యాధులు ప్ర‌పంచంలో ప్ర‌బ‌లాయి. కాక‌పోతే ఇంత తీవ్రంగా.. ఇంత దుర్భ‌ర ప‌రిస్థితులు వ‌చ్చేలా ఏ వ్యాధి ప్ర‌బ‌లించ‌లేదు. గ‌తంలో స్వైన్‌ ఫ్లూ ప్ర‌పంచాన్ని ఊపేసింది. అయితే ఆ ఫ్లూ క‌న్నా క‌రోనా వైర‌స్ మ‌రి తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో ఫ్లూ, కరోనా వైర‌స్ రెండింటిని ప‌రిశీలించిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) ఓ నివేదిక విడుద‌ల చేసింది. స్వైన్ ఫ్లూ క‌న్నా క‌రోనా వైర‌స్ పది రెట్లు ప్రమాదకరమని డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్రపంచంలో విల‌య తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టిదాక భూగోళంలో లక్షా 18 వేల మంది ప్రాణాలు కోల్పోగా 16 ల‌క్ష‌లకు పైగా ఆ వైర‌స్ బారిన ప‌డ్డారు.

ఈ స‌మ‌యంలో క‌రోనాపై ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను 2009లో ప్రపంచాన్ని కుదిపేసిన స్వైన్‌ ఫ్లూ కంటే ఇది పది రెట్లు ప్రమాదకరమని తెలిపింది. కరోనా వైరస్.. స్వైన్‌ ఫ్లూ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. ఈ వైరస్‌ కి వ్యాక్సిన్‌ కనుగొనడంతోనే దీనికి అడ్డుకట్ట వేయగలమని అభిప్రాయపడింది. కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుందని, 11 ఏళ్ల క్రిందట ప్రపంచాన్ని వణికించిన హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) కంటే కరోనా చాలా శక్తివంతమైనదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ఆంధానోమ్ గెబ్రియేసుస్ తెలిపారు. వ్యాక్సిన్‌ కనిపెట్టేంత వరకు అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని వెల్ల‌డించారు.

వైరస్ తీవ్రత తగ్గిన క్రమంలో లాక్‌డౌన్ ఎత్తివేసే వేళ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని టెట్రోస్ హెచ్చ‌రిస్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా మళ్లీ తిరిగి రాకపోకలు ప్రారంభమైతే కరోనా ముప్పు మళ్లీ తలెత్తే ప్రమాదం లేకపోలేదని డ‌బ్ల్యూహెచ్ఓ హెచ్చ‌రిస్తోంది. అప్పుడు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తోంది.