Begin typing your search above and press return to search.

ఎవరు చెప్పారు బంగాళదుంప తింటే లావు అవుతారని?

By:  Tupaki Desk   |   15 May 2021 2:30 AM GMT
ఎవరు చెప్పారు బంగాళదుంప తింటే లావు అవుతారని?
X
బరువు తగ్గాలన్నంతనే గుర్తుకు వచ్చేది బంగాళదుంప. ముందు ఏం చేసినా.. చేయకున్నా ఆలూను ఆహారం నుంచి మిస్ చేస్తే.. బరువు తగ్గిపోతామన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తుంది. బరువును తగ్గించుకో ఒంట్లో అదనపు కొవ్వును వదిలించుకోక తప్పదు. అందుకు ఆహారం ప్రధానమన్న విషయం తెలిసిందే. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మనం తినే ఆహారంలో ఆలూ ఎక్కడో ఒక చోట టచ్ అవుతూనే ఉంటుంది.

చూసినంతనే వివిధ రూపాల్లో తయారయ్యే ఫుడ్ లో ఆలూకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటిది ఆలూను టచ్ చేయకుండా రోజు ఫుడ్ తీసుకోవటం కష్టంతో కూడుకున్నదే. అయితే.. చాలామంది అపోహ పడుతున్నట్లుగా ఆలుగడ్డ తింటే బరువు పెరుగుతారన్న దాన్లో నిజం సగమేనని చెబుతున్నారు. ఎందుకంటే.. ఆలు గడ్డలో పొటాషియం మెండుగా ఉంటుంది. బీపీని కంట్రోల్ లో ఉంచే సుగుణం దాని సొంతం.

చర్మ నిగారింపుకు కూడా ఉపయోగపడుతుందని చెబుతారు. కానీ.. ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది.. ఆలూను ఆయిల్ తో వేయించి తింటే మాత్రం.. దీని కారణంగా పెరిగే బరువు అధికంగా ఉంటుంది. అందుకే.. వీలైనంత వరకు ఉడకబెట్టిన ఆలూను కూరల్లో తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. బంగాళదుంపను తింటూనే బరువు తగ్గే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు.

క్యారెట్ లో పీచు గుణం ఎక్కువ. బీటా కెరొటిన్ ఎక్కువగా ఉండటంతో కొవ్వును ఖర్చు చేసే స్రావాలకు ఇది సాయం చేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన దుంపల్లో కేరట్ చాలా కీలకం. ఇక.. ప్రస్తుతం ఉన్న కొవిడ్ కాలంలో ఆకు కూరల అవసరం చాలా ముఖ్యం. పోషకాలు భారీగా ఉండే వీటిల్లో లభ్యమయ్యే కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ.. పీచు గుణం ఉండటం వల్ల కాస్త తిన్నా కూడా కడుపు నిండిన భావన ఉంటుంది. దీనికి తోడు మలవిసర్జనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తేలిగ్గా ఆరిగే గుణం ఎక్కువ.