Begin typing your search above and press return to search.

కరోనా టీకా ఎవరు వేయించుకోవాలి...ఎవరు వేయించుకోకూడదు?

By:  Tupaki Desk   |   21 April 2021 11:30 AM GMT
కరోనా టీకా ఎవరు వేయించుకోవాలి...ఎవరు వేయించుకోకూడదు?
X
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ దేశంలో శరవేగంగా ముందుకు సాగుతుంది. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నా కూడా కరోనా టీకా పై ఇంకా ఎన్నో అనుమానాలు. కరోనా టీకా తీసుకున్నా కూడా కరోనా సోకుతుందేమో అనే భయంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. అసలు వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి.. ఎవరు వేయించుకోకూడదు అనే సందేహాలు కూడా ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్‌లను ఎవరు వేయించుకోవాలి? ఎవరు వేయించుకోకూడదు అనే వివరాల్లోకి వెళ్తే ..

వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకున్న వారు ఫీవర్ ఉంటె , అది పూర్తిగా తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ వేసుకోవాలి. అలర్జీ సమస్యలు ఉంటే కూడా తగ్గిన తర్వాతే వ్యాక్సిన్ వేయించుకోవాలి. మొదటి డోస్‌ తర్వాత ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే , కరోనా రెండో డోసు తీసుకోకపోవడమే మంచిది. బలహీనమైన వ్యాధినిరోధకత ఉన్నవారు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణీలు, అవయవమార్పిడి చేయించుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోకూడదు. గర్భిణులు టీకా తీసుకోకూడదు. పిల్లలను కన్న బాలింతలు, పాలు ఇస్తున్న తల్లులు వ్యాక్సిన్‌కి దూరంగా ఉండాలి. ప్లాస్మా థెరపీ తీసుకున్నవారు కనీసం 4 నుంచి 8 వారాల గ్యాప్ తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి.

ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, HIV పేషెంట్లు, రకరకాల కారణాలతో వ్యాధినిరోధక శక్తి కోల్పోతున్నవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. రక్తం గడ్డకట్టకుండా ఉండే సమస్య కొందరికి ఉంటుంది. అలాంటి వారు వ్యాక్సిన్ వేయించుకోకూడదు. అయితే అధ్యయనాలు చెబుతున్నదాని ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇక కరోనా రాదు అనేది లేదు. కరోనా సోకచ్చు, సోకపోవచ్చు. కానీ, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారి నుంచి కరోనా వ్యాపించదు అని అంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు ట్రాన్స్‌మిటర్లుగా మాత్రం ఉండట్లేదు.