Begin typing your search above and press return to search.
ఇండియా డేంజర్లో ఉంది జరభద్రం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
By: Tupaki Desk | 14 Sep 2020 11:30 PM GMTకరోనా కేసులు ఇండియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయని.. భవిష్యత్‌లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చని.. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనదేశాన్ని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. లాక్‌డౌన్ ఎత్తేశాక మనదేశంలో కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్ ఆరంభం నుంచి రోజుకు సగటున 1000మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో భారత్‌లో పెరుగుతున్న కేసులపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. గత 24 గంటల్లో ప్రపవంచవ్యాప్తంగా 307,930 కేసులు నమోదయ్యాయని ఇప్పటికవరకు అత్యధిక కేసుల్లో ఇదే రికార్డని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. నిన్న ఒక్కరోజే 5,500మంది మరణించారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 917,417 చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్‌వో ఆందోళన చెందు తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.8 కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా రోజువారి కేసుల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దూసుకుపోతున్నాయి.
ఏయే దేశంలో ఎన్నికేసులు?
డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం.. ఆదివారం మనదేశంలో 94,372 కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 45,523, బ్రెజిల్‌లో 43,718 కేసులు రికార్డయ్యాయి. దీన్నిబట్టి అమెరికా, బ్రెజిల్ కంటే ఇండియానే కేసుల సంఖ్యలో దూసుకుపోతున్నది. గత 24 గంటల్లో భారత్, అమెరికాలో సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోగా.. బ్రెజిల్‌లో 874 మంది చనిపోయారు. ఒక్క ఆగస్టు నెలలోనే మనదేశంలో 20లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మిగతా దేశాల్లో..
అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాల్లో మెజార్టీ కేసులు నమోదవుతుంటే మిగతా దేశాల్లోనూ కేసుల సంఖ్య తక్కువేమి అక్కడా కేసులు పెరుగుతున్నాయి. యూరప్‌లోనూ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతున్నది. పెరూ, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలలో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా నిబంధనలు తొలగించాలంటూ ఆస్ట్రేలియాలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. సుమారు 250మంది మెల్‌బోర్న్ వీధుల్లో ఆందోళన చేపట్టారు.
న్యూజిలాండ్ ఏ వ్యూహంతో అరికట్టింది
ప్రపంచదేశాలన్ని కరోనాతో సతమతమవగా న్యూజిలాండ్ మాత్రమే పకడ్బందీ చర్యలతో కరోనాను అదుపులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్ సహా దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తామని న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ ప్రకటించారంటే ఆ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
టెస్ట్, ట్రేస్, ట్రీట్ అనే విధానాన్ని అవలంభించడం వల్లే కరోనాను కంట్రోల్ చేశామని ఆ దేశ ప్రధాని ప్రకటించారు.
ఇజ్రాయెల్‌లో మళ్లీ లాక్‌డౌన్
ఇజ్రాయెల్‌లో కరోనా తీవ్ర రూపం దాల్చుతున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో 1,53,000 కేసులు నమోదయ్యాయి. 1,108మంది మరణంచారు. దీంతో అక్కడ లాక్‌డౌన్ మళ్లీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే శుక్రవారం నుంచి ఈ లాక్‌డౌన్ అమలులోకి వస్తుంది.