Begin typing your search above and press return to search.
లాస్ వెగాస్ కాల్పులు...కొన్ని నమ్మశక్య నిజాలు
By: Tupaki Desk | 3 Oct 2017 9:53 AM GMTమూడు రోజుల సంగీత కచేరీ చివరి రోజు...వేలాదిగా సంగీత ప్రియులు...ఉర్రూతలిగుస్తున్న సంగీతం....ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) సమయం పది గంటలు..తమ అభిమాన, ప్రఖ్యాత గాయకుడు అల్డిన్ ఆలపించే మ్యూజిక్‌ను ఆస్వాదిస్తున్న వేళ.. విభావరి ముగింపు దశకు చేరుకున్న సమయాన.. ఒక్కసారిగా భయానక వాతావరణం. విభావరి వేదికకు కొద్దిదూరంలోని బహుళ అంతస్థుల భవనం 32వ అంతస్తు నుంచి అగంతకుడు భీకర కాల్పులు. అసలేం జరుగుతున్నదో తెలిసే లోపలే ఆటోమేటిక్ తుపాకీ నుంచి దూసుకొచ్చిన తూటాలు.. గాయాలతో కొందరు.. కొన ఊపిరితో మరికొందరు హాహాకారాలు.. ప్రాణభయంతో ఉరుకులు పరుగులు..తుపాకీ గుళ్లను తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొందరు నేలపై వాలిపోయారు.
ఇది లాస్‌వెగాస్ సంగీత కచేరీ మృత్యు విభావరి ఉదంతం. ఈ కాల్పుల ఘటనలో 58 మంది మరణించారు. 500 మందికిపైగా గాయపడ్డారు. 406 మందిని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు ధ్రువీకరించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా చరిత్రలో అతిపెద్ద విషాదంగా మిగిలింది. భారీ సంఖ్యలో పౌరులను బలిగొన్న నెత్తుటి మరకగా నిలిచింది. కాల్పులు జరిపిన వ్యక్తిని 64ఏళ్ల స్టీఫెన్ పెడాక్‌గా గుర్తించారు. స్టీఫెన్ స్థానికుడేనని పోలీసులు వెల్లడించారు. ఇంత భయంకరమైన కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎవరో కరడుగట్టిన వ్యక్తి అయి ఉంటాడనే అంచనా సహజంగా అనిపిస్తుంటుంది. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నం! మనమే కాదు.... తాజా ఘటన విషయం తెలిశాక.. పడాక్ ఐసిస్ తీవ్రవాదిగా వెలుగులోకి వచ్చాక.. అతని కుటుంబం షాక్‌కు గురైంది. ఎందుకంటే, ఈనాటి వరకు అతను ఎలాంటి హింసాత్మక సం ఘటనల్లో పాల్గొనదు. నేరచరిత కూడా లేదు.
లాస్‌వెగాస్ మారణహోమంతో అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన స్టీఫెన్ పడాక్ నెవెడా నివాసి. గతంలో ఇతను అకౌంటెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. పడాక్‌ను తమ సైనికుడిగా ఐసిస్ ప్రకటించడంతో అతని కుటుంబం అవాక్కయింది. `మా అన్నయ్యకు తుపాకీ పట్టిన చరిత్ర లేనేలేదు. అలాంటి ఆటోమేటిక్ గన్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో అంతు చిక్కడం లేదు. మా వాడికి మిలటరీ నేపథ్యం లేదు. పూర్తిగా శాకాహారి. పడాక్ ఎలాంటి నేర చరిత లేని లైసెన్స్ కలిగిన పైలట్`` అని అతని సోదరుడు ఎరిక్ పడాక్ తెలిపారు. ``తాజా ఘటన మాకు పిడుగుపాటులా ఉందన్నారు. ఇదంతా ఎలా జరిగిందో తెలీడం లేదు`` అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎల్క్, ఎలుగుబంటి వేటల్లో నిష్ణాతుడైన స్టీఫెన్ పడాక్ అలస్కా నుంచి వేటాడేందుకు లైసెన్స్ పొందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, దుండగుడి హోటల్ గదిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు
మ్యాండలే బే హోటల్‌కు పక్కనే ఉన్న 15 ఎకరాల స్థలంలో ప్రతి సంవత్సరం రూట్91 పేరిట గత నాలుగేళ్లుగా సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూడురోజులపాటు నిర్వహించిన సంగీతోత్సవం చివరి రోజున ప్రఖ్యాత గాయకుడు జేసన్ ఆల్డియన్ తన కచేరీని ముగించే సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. దాదాపు 30వేల మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.08 గంటల సమయంలో దుండగుడు ఒక్కసారిగా పైనుండి తమపై గుండ్ల వర్షం కురిపించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. హోటల్ 32వ అంతస్తులోని దుండగుడి గదికి, కచేరీ జరుగుతున్న మైదానానికి మధ్య 1700 అడుగుల దూరం ఉంది. అంతదూరం నుంచి దుండగుడు ఆటోమేటిక్ తుపాకులతో కాల్పులు జరిపాడని, ఇటువంటి ఘటనను తాము మునుపెన్నడూ చూడలేదని పోలీస్ అధికారి లొంబార్డో పేర్కొన్నారు. దుండగుడి నేపథ్యంపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. హోటల్‌లోని అతని గదిలో పది రైఫిళ్లతోపాటు పలు ఆయుధాలు లభించాయని తెలిపారు. రైఫిళ్లను అతడు అద్దెకు తెచ్చుకున్నాడని తెలిపారు. అతని స్నేహితురాలు ఆసియాకు చెందిన మ్యారిలౌ డ్యాన్లీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని చెప్పారు.