Begin typing your search above and press return to search.

టీడీపీ-జ‌న‌సేన క‌లిసి అధికారంలోకి వ‌స్తే 'ప‌వ‌ర్‌' షేరింగ్ ఎలా?

By:  Tupaki Desk   |   30 Oct 2022 12:30 AM GMT
టీడీపీ-జ‌న‌సేన క‌లిసి అధికారంలోకి వ‌స్తే ప‌వ‌ర్‌ షేరింగ్ ఎలా?
X
ఏంటీ ప్ర‌శ్న‌, ఆలూలేదు.. చూలూ లేదు.. అన్న‌ట్టుగా ఉంది! అంటారా? అలా అనుకోవ‌ద్దు. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. అనేక రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందిన పార్టీలు ఉన్నాయి. ఆ త‌ర్వాత అధికారాన్ని షేర్ చేసుకున్న ప‌రిస్థితిని కూడా మ‌నం చూశాం. సో, ఈ కోవ‌లోనే ఏపీలోనూ జ‌రిగే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన క‌లిసి పోటీ చేసే అవ‌కాశాల‌ను కొట్టిపాయేలేం. ఇప్ప‌టికే ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ పేరుతో ప‌వ‌న్‌-చంద్ర‌బాబులు చేతులు క‌లిపారు. వైసీపీపై త్వ‌ర‌లోనే సంయుక్తంగా యుద్ధం ప్ర‌క‌టించ‌నున్నారు.

అనంత‌రం.. ఇది ఎన్నిక‌ల‌కు వ‌ర‌కు వెళ్లి, క‌లిసి పోటీ చేసినా ఆశ్చ‌ర్యంలేదు. ఈ క్ర‌మంలో ఎన్ని సీట్లు పంచుకుంటారు? అనేది కూడా ఆస‌క్తిగానే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం రాష్ట్రంలో 175 స్థానాల్లో 60 నుంచి 65 స్థానాల‌ను జ‌న‌సేన‌కు టీడీపీ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఒక‌వేళ వేరే పార్టీలు కూడా జ‌త‌క‌డితే అప్పుడు ఈ సంఖ్య 50-60 మ‌ధ్య‌లో ఉంటుంద‌ని స‌మాచారం. స‌రే, ఈ కూట‌మి అధికారంలోకి క‌నుక వ‌స్తే.. ఎవ‌రు సీఎం అవుతారు? ఎలా ప‌దువులు పంచుకుంటారు? అనేదికూడా ఆస‌క్తిక‌ర అంశ‌మే.

దీనిని ప‌రిశీలిస్తే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అసెంబ్లీ సాక్షిగా ఒక శ‌ప‌థం చేశారు. మ‌ళ్లీ ముఖ్యమంత్రిగానే తాను అసెంబ్లీకి వ‌స్తాన‌న్నారు. అంటే, చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న మాట‌. దీనిని బ‌ట్టి కూట‌మి స‌ర్కారు వ‌స్తే చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రి అవుతార‌నేది తెలుస్తోంది.

అయితే, ఇక్క‌డే ఒక ట్విస్టు ఉంది. జ‌న‌సేన అభిమానులు.. ప‌వ‌న్‌నే సీఎం కావాల‌ని కోరుతున్నారు.ఆయ‌న ఎక్క‌డ క‌నిపించినా 'ప‌వ‌న్ సీఎం' అంటూ నినాదాల‌తో హోరెత్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కూడా సీఎం ప‌ద‌విని అల‌క‌రించే అవ‌కాశం ఉంది. లేక‌పోతే.. అభిమానులు నిరుత్సాహానికి గురికావ‌డం త‌థ్యం.

ఈ నేప‌థ్యంలో ప‌ద‌వుల పంప‌కం 50:50 అన్న‌ట్టుగా ఉంటుంద‌నేది కొంద‌రి వాద‌న‌. కుదిరితే డిప్యూటీసీఎం ప‌ద‌విని ప‌వ‌న్‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అయితే, దీనికి పార్టీ అభిమానులు ఒప్పుకొనే అవ‌కాశం లేనందున రెండున్న‌రేళ్లు అధికారం పంచుకుంటార‌ని, సీఎంలు రెండున్న‌రేళ్లు ఉండి.. పొత్తు ఉంది కాబ‌ట్టి మంత్రుల‌ను మార్చుకుని ఇరు పార్టీల‌కు న్యాయం చేస్తార‌ని ఒక విశ్లేష‌ణ సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. దీనికి క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఇటీవ‌ల బీహార్ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.