Begin typing your search above and press return to search.

పురుషుడు, స్త్రీ.. ఆ ఆనందం ఎవరికెక్కువ?

By:  Tupaki Desk   |   11 Nov 2019 10:52 AM GMT
పురుషుడు, స్త్రీ.. ఆ ఆనందం ఎవరికెక్కువ?
X
ప్రస్తుత ఆధునిక సమాజం.. లక్షల్లో జీతం.. ఉరుకుల పరుగుల జీవితం.. కానీ సంసారం చేయడానికి మాత్రం ఎవ్వరికీ టైం ఉండడం లేదు. శృంగారం దివ్యౌషధం అని నిపుణులు చెబుతున్నా ఆ సుఖాన్ని అనుభవించడానికి యువతకు ఉద్యోగాలు.. పని ఒత్తిడి అడ్డువస్తున్నాయి. అయితే శృంగారం విషయంలో ఎవరికి ఎక్కువ ఆనందం ఉంటుందని విషయంపై తాజాగా డెన్మార్క్ పరిశోధకులు చేసిన సర్వేలో ఆశ్చర్యకర ఫలితం వచ్చింది..

మన సమాజంలో శృంగారం విషయంలో పురుషులు కాస్త ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. వారిలో లైంగిక వాంఛలు కూడా ఎక్కువగా ఉంటాయి. సమాజపు కట్టుబాట్లతోటి మహిళలు కాస్తా రిజర్వుడుగానే ఉంటారు.

అయితే శృంగారం విషయంలో పురుషులే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఈ విషయంలో మహిళలకే ఆ తృప్తి ఎక్కువ అని డెన్మార్క్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

శృంగారంలో మహిళలు రెండు మూడు సార్లు భావప్రాప్తితో ఆనందం పొందితే.. పురుషుడి చివర్లో పూర్తయ్యే సమయంలోనే ఆ ఆనందం పొందుతాడని పరిశోధకులు తేల్చారు. ఆనందం విషయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సుఖపడుతారని సర్వేలో తేలింది.