Begin typing your search above and press return to search.
టీడీపీలో అరెస్టయ్యే థర్డ్ వికెట్ లోకేషేనా?
By: Tupaki Desk | 16 Jun 2020 11:10 AM GMTఓ వైపు అచ్చెన్నాయుడిని బుక్ చేశారు. మరోవైపు ఫైర్ బ్రాండ్స్ జేసీ బ్రదర్ ను జైల్లో వేశారు. ఏపీలో కొలువైన వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ ఇప్పుడు టీడీపీ నాయకులను షాక్ కు గురిచేస్తోంది.
అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ టీడీపీ నేతలు అరెస్ట్ అయినప్పటి నుంచి రాజకీయవర్గాలు, మీడియా సర్కిళ్లలో నెక్ట్స్ ఎవరు అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా వీరిద్దరి తర్వాత గత హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన దేవినేని ఉమా, పౌరసరఫరాల శాఖ చూసిన ప్రత్తిపాటి పుల్లారావులు నెక్ట్స్ జాబితాలు ఉండవచ్చని లీకులు మొదలయ్యాయి.
ఇంతలో, టిడిపి ప్రధాన కార్యదర్శి , ఐటి పంచాయతీ రాజ్ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ ను కూడా అరెస్టు చేయవచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లోకేష్ అరెస్ట్ అయితే అతడి వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతినడంతోపాటు అతని తండ్రి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు శక్తిని కూడా తగ్గిస్తుందని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
అధికార పార్టీ కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్న టిడిపికి ఇది సానుభూతిగా మారుతుందనే వాస్తవాన్ని కూడా మర్చిపోకూడదు.
అయితే, ఇవన్నీ చలామణిలో ఉన్న కేవలం ఊహాగానాలు మాత్రమే.టిడిపిలో తదుపరి వికెట్ ఎవరు అరెస్టు అవుతారన్నది ఇప్పుడే ఊహించని విధంగా ఉంది. జగన్ టార్గెట్ ఎవరన్నది మున్ముందు తేలనుంది.