Begin typing your search above and press return to search.

బీజేపీ పార్ల‌మెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్ర‌ప‌తిగా ఎవ‌రు?

By:  Tupaki Desk   |   16 July 2022 6:30 AM GMT
బీజేపీ పార్ల‌మెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్ర‌ప‌తిగా ఎవ‌రు?
X
రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి జూలై 18న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డంపై బీజేపీ దృష్టి సారించింది. ఇప్ప‌టికే ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 10తో ముగియ‌నుంది.

ఈ నేప‌థ్యంలో నూత‌న ఉప‌రాష్ట్ర‌ప‌తి నియామ‌కానికి జూలై 19 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. జూలై 20న నామినేష‌న్ల‌ను ప‌రిశీలిస్తారు. ఇదే నెల 22న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణకు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. కాగా ఆగ‌స్టు 6న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అదేరోజు ఓట్ల‌ను లెక్కించి ఫ‌లితాలు కూడా ప్ర‌క‌టించ‌నున్నారు.

కాగా ఉప‌రాష్ట్ర‌ప‌తిని పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల స‌భ్యులు అంటే.. లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు ఎన్నుకుంటారు. రెండు స‌భల్లోనూ బీజేపీకి మంచి మెజారిటీ ఉండ‌టంతో ఆ పార్టీ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎవ‌రిని నిల‌బెడితే వారు విజ‌యం సాధించ‌డం ఖాయం. వేరే పార్టీల మ‌ద్ద‌తు కూడా బీజేపీకి అవ‌స‌రం ప‌డ‌దు. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి 303 మంది సభ్యులు ఉండగా, రాజ్యసభలో 91 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఈ 91 మంది సభ్యులతో పాటు, 5 నామినేటెడ్ సభ్యులు కూడా బీజేపీకి ఓటు వేయవచ్చు. లోక్ స‌భ‌లో మొత్తం అన్ని పార్టీల‌ ఎంపీల సంఖ్య 545 కాగా, రాజ్య‌స‌భ‌లో ఈ సంఖ్య 250.

భారత ఉప రాష్ట్ర ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల కాగా.. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబందించి పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.. ఇక, ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది.

ఈ నేప‌థ్యంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డంపై బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు జూలై 16న సాయంత్రం స‌మావేశం కాబోతోంది. ఈ సమావేశానికి ప్రధాని న‌రేంద్ర‌ మోడీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌దిత‌రులు హాజరుకానున్నారు. ఈ స‌మావేశంలో ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున‌ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.

కాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌దవికి బీజేపీ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌క్వీ, జ‌మ్ము కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి. కాంగ్రెస్ పార్టీ నేత గులామ్ న‌బీ ఆజాద్, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరు కాకుండా బీజేపీ అధిష్టానం కొత్త పేర్ల‌ను ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని అంటున్నారు.